రెండున్నరేళ్ల చిన్నారిపై మాస్టర్‌ లైంగికదాడి | karatemaster did physical harrsement on child | Sakshi
Sakshi News home page

రెండున్నరేళ్ల చిన్నారిపై మాస్టర్‌ లైంగికదాడి

Published Fri, Sep 16 2016 10:38 PM | Last Updated on Mon, Sep 4 2017 1:45 PM

ఆందోళన చేస్తున్న టీఎన్ఎస్‌ఎఫ్‌ నాయకులు

ఆందోళన చేస్తున్న టీఎన్ఎస్‌ఎఫ్‌ నాయకులు

కుషాయిగూడ:  చిన్నారిపై లైంగికదాడికి పాల్పడ్డాడన్న ఫిర్యాదు మేరకు ఓ పాఠశాల కరాటే మాస్టర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ఈ విషయం తెలిసి విద్యార్థి సంఘాలు పాఠశాల ఎదుట శుక్రవారం ఆందోళనకు దిగాయి. విద్యార్థిని తండ్రి, కుషాయిగూడ పోలీసుల కథనం ప్రకారం... నాగారం ఎస్‌వీనగర్‌కు చెందిన రెండున్నరేళ్ల చిన్నారి స్థానిక  ఐరీష్‌ ప్లోరెస్ట్‌ ప్లేస్కూల్‌లో చదువుతోంది. ఈనెల 7న పాఠశాలకు వెళ్లి ఇంటికి వచ్చింది. ఎప్పుడూ హుషారుగా ఉండే చిన్నారి ఆరోజు నుంచి భయం.. భయంగా, దిగులుగా ఉంటోంది. తల్లిదండ్రులు చిన్నారిని ఏమైందని అడగ్గా కరాటే మాస్టర్‌ సాయికిరణ్‌ తనతో ప్రవర్తించిన తీరు వెల్లడించింది. 

తల్లిదండ్రులు గత సోమవారం పాఠశాలకు వెళ్లి డైరక్టర్, సిబ్బందిని నిలదీయగా.. వారు తప్పును తప్పు కప్పిపుచ్చేలా మాట్లాడారు. దీంతో అదే రోజు చిన్నారి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.  కేసు నమోదు చేసిన పోలీసులు  కరాటే మాస్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం అతడిని వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఇన్‌స్పెక్టర్‌ ఎన్. వెంకటరమణ తెలిపారు.

నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని  టీఎన్ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో పాఠశాల ఎదుట ఆందోళన నిర్వహించాయి.  ఈ విషయంపై  పాఠశాల డైరెక్టర్‌ అనితను ‘సాక్షి’ వివరణ కోరగా.. తమ పాఠశాలలో అలాంటి ఘటన జరిగేందుకు ఆస్కారం లేదని, ఒకవేళ అలాంటిదేమైనా జరిగితే దోషులకు శిక్ష పడేందుకు చిన్నారి తల్లిదండ్రులకు అండగా నిలుస్తామన్నారు.  



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement