physical harrasement
-
ముషక్‌మహల్‌లో మహిళపై దారుణం!
అత్తాపూర్: మహిళపై లైంగికదాడికి పాల్పడి, ఆపై కిరాతకంగా హత్య చేసిన ఘటన రాజేంద్రనగర్ ఠాణా పరిధిలో ఆదివారం వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం...అత్తాపూర్‌లో ముషక్‌మహల్ అనే పురాతన భవనం ఉంది. శిథిలావస్థకు చేరిన ఈ భవనం నుంచి ఆదివారం దుర్వాసన రావడంతో స్థానికులకు అనుమానం వచ్చి పరిశీలించగా.. వివస్త్ర అయిన ఓ మహిళ శవం కనిపించింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఉంది. కుడి చేయి సగం నరికేసి, మెడ, దవడ భాగం అతుక్కొని ఉన్నాయి. ఎడమ కాలిపై గాయం ఉంది. మృతురాలి పక్కనే ఒక బండరాయి పడి ఉంది. దుండగులు బండరాయితో ఆమె తల, కాలిపై కొట్టి చంపినట్టు పోలీసులు భావిస్తున్నారు. చుట్టు పక్కల గాలించగా మృతురాలి దుస్తులు లభించాయి. ముషక్‌మహల్ పైకి ఎక్కే మెట్లపై మద్యం సీసాలు పగులగొట్టి ఉన్నాయి. దీంతో గుర్తు తెలియని వ్యక్తులు ఆమెపై లైంగికదాడికి పాల్పడి, అనంతరం హత్య చేసి ఉంటారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మృతదేహం కుళ్లిపోయి, ముఖం గుర్తు పట్టలేని విధంగా ఉండటంతో నాలుగైదు రోజుల క్రితమే ఈ హత్య జరిగి ఉంటుందంటున్నారు. డాగ్‌స్కా్వడ్‌ను రప్పించగా... పోలీసు జాగిలం ఘటనా స్థలం నుంచి సమీపంలోని పొలాల్లోకి వెళ్లి ఆగింది. మృతురాలిని స్థానికులు గుర్తు పట్టలేకపోవడంతో.. ఆమె ఎవరనేది తెలుసుకొనేందుకు అన్ని పోలీసుస్టేషన్లకు ఫొటోలను పంపారు. మృతురాలు ఎవరనేది తెలిస్తే .. హత్య మిస్టరీ వీడుతుందని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది. -
రెండున్నరేళ్ల చిన్నారిపై మాస్టర్ లైంగికదాడి
కుషాయిగూడ: చిన్నారిపై లైంగికదాడికి పాల్పడ్డాడన్న ఫిర్యాదు మేరకు ఓ పాఠశాల కరాటే మాస్టర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలిసి విద్యార్థి సంఘాలు పాఠశాల ఎదుట శుక్రవారం ఆందోళనకు దిగాయి. విద్యార్థిని తండ్రి, కుషాయిగూడ పోలీసుల కథనం ప్రకారం... నాగారం ఎస్వీనగర్‌కు చెందిన రెండున్నరేళ్ల చిన్నారి స్థానిక ఐరీష్ ప్లోరెస్ట్ ప్లేస్కూల్లో చదువుతోంది. ఈనెల 7న పాఠశాలకు వెళ్లి ఇంటికి వచ్చింది. ఎప్పుడూ హుషారుగా ఉండే చిన్నారి ఆరోజు నుంచి భయం.. భయంగా, దిగులుగా ఉంటోంది. తల్లిదండ్రులు చిన్నారిని ఏమైందని అడగ్గా కరాటే మాస్టర్ సాయికిరణ్ తనతో ప్రవర్తించిన తీరు వెల్లడించింది. తల్లిదండ్రులు గత సోమవారం పాఠశాలకు వెళ్లి డైరక్టర్, సిబ్బందిని నిలదీయగా.. వారు తప్పును తప్పు కప్పిపుచ్చేలా మాట్లాడారు. దీంతో అదే రోజు చిన్నారి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు కరాటే మాస్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం అతడిని వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఇన్స్పెక్టర్ ఎన్. వెంకటరమణ తెలిపారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పాఠశాల ఎదుట ఆందోళన నిర్వహించాయి. ఈ విషయంపై పాఠశాల డైరెక్టర్ అనితను ‘సాక్షి’ వివరణ కోరగా.. తమ పాఠశాలలో అలాంటి ఘటన జరిగేందుకు ఆస్కారం లేదని, ఒకవేళ అలాంటిదేమైనా జరిగితే దోషులకు శిక్ష పడేందుకు చిన్నారి తల్లిదండ్రులకు అండగా నిలుస్తామన్నారు.