కుషాయిగూడ సమీపంలోని కందిగూడ చౌరస్తా వద్ద బుధవారం ఉదయం శ్రీకాంత్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.
కుషాయిగూడ సమీపంలోని కందిగూడ చౌరస్తా వద్ద బుధవారం ఉదయం శ్రీకాంత్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఆగంతకులు శ్రీకాంత్ గొంతు కోసి అత్యంత పాశవికంగా హత్య చేశారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసుకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని శ్రీకాంత్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం పోలీసులు అతని మృతదేహన్ని నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
హత్య ఘటనపై స్థానికుల నుంచి పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. పాతకక్షల కారణంగా హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. హత్య ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు. నిందితులను సాధ్యమైనంత త్వరలో పట్టుకుంటామని పోలీసలు వెల్లడించారు.