కుషాయిగూడ లక్ష్మీనరసింహ కాలనీలో బుధవారం ఎస్ఓటీ పోలీసులు పేకాటస్థావరాలపై దాడులు జరిపారు.
హైదరాబాద్: కుషాయిగూడ లక్ష్మీనరసింహ కాలనీలో బుధవారం ఎస్ఓటీ పోలీసులు పేకాటస్థావరాలపై దాడులు జరిపారు. ఈ దాడుల్లో ఐదుగురు పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. వారితోపాటు 5 సెల్ఫోన్లు, 20వేల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులపై కేసు నమోదు చేశారు.