హైదరాబాద్ : నగరంలోని కుషాయిగూడ పరిధిలోని డిఫెన్స్ కాలనీలో మంగళవారం ఉత్తరాఖండ్‌కు చెందిన దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరూ కలిసి ఇంట్లో ఒకే ఫ్యానుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. భార్యాభర్తల మధ్య ఇటీవల గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇరువురు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.