కుషాయిగూడ (హైదరాబాద్) : నగరంలోని కుషాయిగూడ ఈసీఐఎల్ క్రాస్ రోడ్డు వద్ద లారీ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం ఉదయం జరిగింది. నల్లగొండ జిల్లా బొమ్మలరామారం మండలం చీకటిమామిడి గ్రామానికి చెందిన భూపతి మధుసూదన్‌రావు బైక్‌పై వెళుతుండగా లారీ ఢీకొనడంతో అతడు తీవ్రంగా గాయపడి ప్రమాద స్థలంలోనే ప్రాణాలు విడిచాడు.