కుషాయిగూడలో వ్యక్తి ఆత్మహత్య
Published Fri, Sep 30 2016 4:31 PM | Last Updated on Wed, Aug 29 2018 8:38 PM
హైదరాబాద్: నగరంలోని కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నాగార్జున నగర్ కాలనీకి చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికంగా ఉండే డి.సురేష్(35) అనే వ్యక్తి బాత్రూంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పులబాధతోనే బలవన్మరణానికి పాల్పడినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సురేష్‌కు భార్యా ఇద్దరు పిల్లలున్నారు.
Advertisement
Advertisement