మంటలార్పుతూ గాయపడిన ఫైర్మెన్
Published Thu, Oct 27 2016 12:45 PM | Last Updated on Thu, Sep 13 2018 5:22 PM
హైదరాబాద్: కుషాయిగూడలో జరిగిన అగ్నిప్రమాదంలో మంటలు ఆర్పుతూ ఫైర్ స్టేషన్ సిబ్బంది ఒకరు గాయపడ్డారు. స్థానిక చిన్నచెర్లపల్లిలో ఓ ఇంట్లో వంట చేస్తుండగా మంటలు చెలరేగాయి. ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు యత్నించారు. ఈ సందర్భంగా ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలటంతో సమీపంలోనే ఉన్న ఫైర్‌మన్ గాయపడ్డారు. ఆయన్ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు మిగిలిన ఫైర్‌సిబ్బంది, స్థానికులు ప్రయత్నిస్తున్నారు.
Advertisement
Advertisement