సాక్షి,కుషాయిగూడ: కుషాయిగూడలో సోమవారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో పలు దుకాణాలు, వాహనాలు దగ్ధమయ్యాయి. దీంతో చిరువ్యాపారులు పలువురు తీవ్రంగా నష్టపోయారు. వివరాల్లోకి వెళ్తే.. కుషాయిగూడ శ్రీ పద్మావతి వెంకటేశ్వరస్వామి ఆలయానికి సంబంధించి ఖాళీ స్థలంలో స్థలాన్ని లీజుకు తీసుకొని కొంతమంది చిరు వ్యాపారాలు చేస్తున్నారు. రోజులాగానే ఆదివారం రాత్రి అందరూ షాపులు కట్టేసి వెళ్లారు. తెల్లవారు జామున ఒక్కసారిగా అకస్మాత్తుగా ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడ్డాయి.
అప్రమత్తమైన స్థానికులు పోలీసులు, ఫైర్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది సుమారు 4 గంటల పాటుగా శ్రమించి మంటలను అదుపు చేసినా ఫలితం కన్పించలేదు. అప్పటికే మూడు కూలర్ల షాపులు, ఫర్నిచర్, చెప్పుల దుకాణాలు, హోంనీడ్స్ ఇండియన్ బజార్, మర్తమాండ్ల దుకాణాలతో పాటు సమీపంలో పార్కు చేసిన రెండు వాహనాలు మంటల్లో కాలిపోయాయి. దీంతో దాదాపు రూ.కోటి వరకు ఆస్తి నష్టం సంభవించిందని బాధితులు వాపోయారు. అగ్నిప్రమాదానికి కారణాలు మాత్రం తెలియరాలేదు.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment