
పైకప్పు కూలి ఇద్దరు కూలీలు మృతి
హైదరాబాద్ : కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎన్‌ఎఫ్‌సీలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం పైకప్పు కూలి ఇద్దరు కూలీలు మృతిచెందారు. ఈ దుర్ఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మరో ఏడుగురు కూలీలు కూడా గాయపడ్డారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీం వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించింది.