కుషాయిగూడ (హైదరాబాద్) : రోడ్డుపై వెళుతున్న యాక్టివా పై నుంచి పడి ఓ చిన్నారి మృతి చెందిన సంఘటన బుధవారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పావని అనే మహిళ కుషాయిగూడ నుంచి నాగారం వైపు బైక్పై తన రెండేళ్ల బాబును కూర్చోబెట్టుకుని వెళుతుంది. మార్గమధ్యంలో యాక్టివాపైనున్న చిన్నారి కింద పడిపోయాడు. తీవ్రగాయాలైన బాబు అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.