
ప్రతీకాత్మకచిత్రం
సాక్షి, కుషాయిగూడ: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఓ మసాజ్ సెంటర్‌పై బుధవారం పోలీసులు, రెవెన్యూ అధికారులు ఆకస్మిక దాడులు చేసి సెంటర్‌ను సీజ్ చేశారు. ఏఎస్‌రావునగర్‌లో గ్లోవిష్ బ్యూటీ కేర్ పేరుతో కొంత కాలంగా మసాజ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. ఇందులో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు బుధవారం దాడి చేశారు. ఈ సందర్భంగా మాదిపల్లి మహేశ్ అనే వ్యక్తితో పాటు, మరో ఐదుగురు మహిళలను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్ మన్మోహన్ తెలిపారు.