సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ల గెలుపు కోసం పనిచేస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఒక్క తెలంగాణ కోసం తప్ప తాను ఎప్పుడూ పార్టీని వ్యతిరేకించలేదని పేర్కొన్నారు. తన నియోజకవర్గం, తన శాఖ తప్ప వేరే పట్టించుకోవడం లేదని అన్నారు. కేసీఆర్ ఆయన చేసిన పాపాలే ఇప్పుడు ఆయన్ను చుట్టుకున్నాయని విమర్శించారు. యాదగిరగుట్ట పేరును యాదాద్రిగా మార్చడమే కేసీఆర్ చేసిన మొదటి తప్పని అన్నారు. కేసీఆర్ చేసిన పాపాల వల్ల నేడు రాష్ట్రానికి కరువు వచ్చిందన్నారు. దేవుడి పేరు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి సర్వనాశనం చేశారని మండిపడ్డారు. .
బీసార్‌ఎస్ పార్టీ ఖాళీ అవుతుంటే కేసీఆర్ మైండ్ బ్లాక్ అయి ఏదేదో మాట్లాడుతున్నారని కోమటిరెడ్డి దుయ్యబట్టారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ లేదని, అందుకే టికెట్ ఇచ్చినా వద్దు అని ప్రకటిస్తున్నారని అన్నారు. ‘మేము గేట్లు తెరుచుడు కాదు...గేట్లు తెరవకముందే కాంగ్రెస్‌లోకి తోసుకుని వస్తున్నారు. మా గేట్లు పలగొట్టి పార్టీలో జాయిన్ అవుతున్నారు’ అని తెలిపారు. బీఆర్‌ఎస్ పార్టీలో ఒక్కరూ మిగిలరని పేర్కొన్నారు.
బీజేపీ నుంచి రాకుంటే ఆపుకుంటే చాలు
ఉద్యమాల పోరాట గడ్డ తెలంగాణ గడ్డ. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక లెక్క తెలంగాణ ప్రభుత్వాన్ని పడకొడితే ఊరుకోం. మా ప్రభుత్వాన్ని పడగొట్టుడు తరువాత బీజేపీకి ఉన్న 8మంది ఎమ్మెల్యేలు మా దగ్గరకు రాకుండా ఆపుకుంటే చాలు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం, మంత్రులు, ఎమ్మేల్యేలు అందరూ ఒక్కటే. కేసీఆర్ ప్రభుత్వంలో R అండ్ D మినిస్టర్ గణపతి రెడ్డి మాత్రమే...ప్రశాంత్ రెడ్డి కాదు. ప్రశాంత్ రెడ్డి మాత్రమే కాదు కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్‌దే నడిచింది. రేవంత్‌కు తెలియక నలుగురే రావులు ఉన్నారు అనుకున్నారు
కాంగ్రెస్ వర్సెస్ బీజేపీకి మాత్రమే పోటీ
అవినీతి చూస్తుంటే రావులందరూ ఒకే దగ్గర జమైనారు. ప్రగతి భవన్‌ను జైలులాగా మార్చి రావులందరిని వేయాల్సి వచ్చేలా ఉంది. ఒక్కరిద్ధరే అనుకున్నాం కానీ తవ్వేకొద్దీ రావులందరూ బయటకు వస్తున్నారు. కేసీఆర్ అవితిని అంతా తీయాలంటే మాకు 20 ఏళ్లు పడేటట్లు ఉంది. పార్లమెంట్‌లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీకి మాత్రమే పోటీ. మా అన్నదమ్ముల మధ్య ఎలాంటి విభేదాలు లేవు. భగవంతుడు కూడా మమ్ములను విడదియ్యలేరు. చిన్న చిన్న మనస్పర్థలు ప్రతీ కుటుంబంలో ఉంటాయి. రాజగోపాల్ రెడ్డి కానీ, నేను టికెట్ అడుగలేదు. మా పెద్దన్న కొడుకు మాకు చెప్పకుండా ధరకాస్తు ఇచ్చారు. తెలిశాక వద్దు అన్నాను.
వైఎస్సార్ ప్లానింగ్ వల్లే హైదరాబాద్ అభివృద్ధి
వైఎస్ఆర్ ప్లానింగ్ వల్లే హైదరాబాద్ అభివృద్ధి వేగంగా జరిగింది. హాలీవుడ్ లాంటి స్టూడియో పెట్టీ టూరిజం పెంచాలని చూస్తున్నాం. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాలేదు. రుణమాఫీ, పెన్షన్లు, లాంటి స్విమ్స్‌కు కొంత సమయం పడుతుంది. ఎలాగోలా నెట్టుకొస్తాం అనుకున్నాం. కానీ కేసీఆర్ అన్ని శాఖల్లో వేల కోట్ల బకాయిలు పెట్టీ పోయారు. రాష్ట్రం నిధులన్నీ సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌లో పెట్టారు. విచారణ చేసి ఆ మూడు సెగ్మెంట్ల నిధుల ఖర్చుపై శ్వేత పత్రం విడుదల చేస్తాం.
కడియం శ్రీహరి అనే వ్యక్తి ఒక సిస్టమేటిక్‌గా ఉంటారు. కడియం శ్రీహరి కూతురు అలా చెప్పింది అంటే అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ 12 సీట్లు రావడం పక్క. మా నల్గొండ, భువనగిరి సీట్లలో భారీ మెజారిటీ వస్తది. బీజేపీకి నాలుగు సీట్లు అనుకుంటున్నా. అక్కడ మేము దృష్టి పెట్టాం. దానం నాగేందర్ ఎమ్మేల్యేకు రాజీనామ చేయకుండా ఎంపికి పోటీ కష్టమే అనుకుంటా. ఒక పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి.. ఇంకో పార్టీలో ఎంపిగా పోటీ అంటే లీగల్ సమస్యలు వస్తాయి అని నా అభిప్రాయం.
సినిమాలు తీసి ప్రజలను రెచ్చకొట్టడం కాదు. పార్టీ పిరాయింపులు అనేది మోదీ, కేసీఆర్ అలవాటు చేసినవనే. బ్లాక్ మనీ అన్నారు ఏమైంది? అదానీ అంబానీ నంబర్ వన్ టు ఎలా అయ్యారు? కిషన్ రెడ్డి తెలంగాణకు ఎం చేశారు? కిషన్ రెడ్డి పుణ్యమా అని కాంగ్రెస్‌కు మంచి జరిగింది. మేము 12అనుకున్నాం కానీ 14 సీట్లు కిషన్ రెడ్డి వల్ల వస్తాయి. కిషన్ రెడ్డి స్థానంలో నేను ఉంటే మూసీ అభివృద్ధి, హైదరాబాద్‌లో సైతం 30, 40వేల పనులు చేసే వాడిని’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment