సాక్షి, నల్గొండ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాష్ట్రంలో ఎన్నికల హడావిడీ ఊపందుకుంది. అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణకు మరో మూడు రోజులు మాత్రమే గడువుండటంతో అన్నీ పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు క్యూ కడుతున్నారు. మరోవైపు కీలక పార్టీ అభ్యర్థులతోపాటు రెబల్స్, స్వతంత్రులు.. ఇలా ఎవరికి వారే ఎన్నికల ప్రచారంలో దూసుకున్నారు.
ఈ క్రమంలో కాంగ్రెస్ అభ్యర్థిగా నల్గొండ అసెంబ్లీ స్థానానికి కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంగళవారం నామినేషన్ వేశారు. అంతకు ముందు కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో మాయమాటలు చెప్పి బీఆర్‌ఎస్ గెలిచిందని విమర్శించారు. పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్ పాలనలో ప్రజల ఆకాంక్షలు నేరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాలను భర్తీలో చేయటంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.
బీఆర్ఎస్ నేతలు నల్గొండను నాశనం చేశారని కోమటిరెడ్డి విమర్శించారు. పోలింగ్‌కు ముందు రైతు బంధు వేస్తారని, దానితో మోసపోవద్దని సూచించారు. డిసెంబర్ 9 కాంగ్రెస్‌కు లక్కీ నెంబర్ అని పేర్కొన్నారు. సోనియా పుట్టిరోజు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నల్గొండ నుంచి తాను కూడా ఎప్పుడో ఒకప్పుడు సీఎం అవుతానని తెలిపారు. అయితే సీఎం కావాలనే తొందర మాత్రం తనకు లేదని చెప్పారు.
చదవండి: పంతం నెగ్గించుకున్న ఈటల, బండి సంజయ్
Comments
Please login to add a commentAdd a comment