సాక్షి, నల్లగొండ జిల్లా: తెలంగాణ ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధుల తీరుపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మండిపడ్డారు. ఖమ్మం సభ విజయవంతం అవుతుందని వాహనాలను అడ్డుకుంటున్నారని, బారీకేడ్లు పెట్టిన తొక్కుకుంటూ వెళ్తామంటూ ఆయన వ్యాఖ్యానించారు. అధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా మారారని, పోడు భూముల సమస్య చెప్పుకోవడానికి వస్తున్న వారిని ప్రభుత్వాధికారులు ఇబ్బంది పెడుతున్నారని ధ్వజమెత్తారు.
‘‘రాహుల్ గాంధీ సభకు అడుగడుగునా ఆంక్షలు విధించడమేంటి?. 4 నెలల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. ఖమ్మంలో కాంగ్రెస్ సభకు నిన్న రాత్రి నుంచి ఆంక్షలు పెట్టారు.. అక్రమ అరెస్టులు చేస్తున్నారు. ఆర్టీసీ వాహనాలను డబ్బులు కడతామన్నా ఇవ్వలేదు. ప్రైవేట్ వాహనాల్లో జనం సభకు వెళ్తుంటే అడ్డుకుంటున్నారు. కాంగ్రెస్ సభకు భయపడి ప్రభుత్వం బస్సులను ఇవ్వలేదు’’ అని మండిపడ్డారు.
‘‘జనాన్ని కాంగ్రెస్ సభకు రాకుండా అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. పోలీసులు న్యాయంగా డ్యూటీ చేయాలి. సభా ప్రాంగణానికి 15, 20 కిలోమీటర్ల దూరంలో ఆపేయడం కరెక్ట్ కాదు. 35 ఏళ్ల నా రాజకీయ జీవితంలో ఇలాంటివి ఎప్పుడూ చూడలేదు’’ అంటూ ఎంపీ కోమటిరెడ్డి నిప్పులు చెరిగారు.
చదవండి: జన గర్జన సభ.. బీఆర్‌ఎస్‌పై రేవంత్‌రెడ్డి ట్వీట్
Comments
Please login to add a commentAdd a comment