సాక్షి, నల్లగొండ: నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్ వైపు చూస్తుండడం.. ఆ చేరికకు తెలంగాణ పీసీసీ సైతం పచ్చ జెండా ఊపిందనే ప్రచారం జోరుగా నడుస్తోంది. ఈలోపు అనూహ్యాంగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మళ్లీ తెర మీదకు వచ్చారు. శనివారం నకిరేకల్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ కార్యకర్తలు, తన అనుచరులతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
‘‘బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేస్తే కాంగ్రెస్ తరపున టికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బీఆర్‌ఎస్ టికెట్ ఇవ్వలేదు కాబట్టే కాంగ్రెస్ వైపు అడుగులేస్తున్నారు. ఎవరో వస్తున్నారన్న వార్తలు నమ్మి కార్యకర్తలు ఆవేశపడొద్దు. కారక్యర్తలు ఎవరి పేరు చెబితే.. వాళ్లనే అభ్యర్థిగా ప్రకటిస్తా. ఉచిత విద్యుత్‌పై రేవంత్ నోరు జారితే.. లాగ్‌బుక్ పెట్టి నష్టనివారణ చేయించింది నేనే అని కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉంటే.. నల్లగొండ కాంగ్రెస్ చేరికలపై కోమటిరెడ్డితో మరో సీనియర్.. ఎంపీ ఉత్తమ్‌కుమార్ సైతం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే అందరినీ కూడదీసుకుని బీఆర్‌ఎస్‌కు ఢీ కొట్టాలనే ఆలోచనతో ఉన్న పీసీసీ చేరికలకు ఆటంకం కలగకుండా ఈ ఇద్దరు సీనియర్లను బుజ్జగించే సంప్రదింపులు జరుపుతోంది. అయితే కోమటిరెడ్డి మాత్రం కార్యకర్తల మనోభావాల్ని పరిగణనలోకి తీసుకోవాలని పీసీసీకి, కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరుతూ వస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment