
ఢిల్లీ: భువనగిరి పార్లమెంట్ స్థానం పరిధిలోని భువనగిరి, జనగామ రైల్వేస్టేషన్ల అభివృద్ధి ఎంతో అవసరం ఉందని, భువనగిరి స్టేషన్ తెలంగాణలోని ప్రముఖంగా రాకపోకలు సాగిస్తున్న రైల్వే స్టేషన్ అని. ఇందుకు సంబంధించి ఆధునీకరణ పనులు చేపట్టాలని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వినతిపత్రం సమర్పించారు. ఈ మేరకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌తో గురువారం భేటీ అయిన వెంకట్‌రెడ్డి.. పలు విషయాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
- భువనగిరి, జనగామ రైల్వేస్టేషన్ల అభివృద్ధి ఎంతో అవసరం
- యాదాద్రిలోని శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది.
- యాదగిరిగుట్ట తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి చెందింది. ప్రతి రోజు వేల మంది భక్తులు ఇక్కడకు వస్తుంటారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు. అలాగే, భువనగిరి రైల్వే స్టేషన్ నుంచి విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, రైతులు నిత్యం హైదరాబాద్ కు రాకపోకలు సాగిస్తుంటారు.
- జనగామ తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాగా ఏర్పడింది.
- ఇక్కడి నుంచి కూడా హైదరాబాద్‌కు రోజూ అనేక మంది విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారస్థులు రాకపోకలు సాగిస్తుంటారు.
- ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న భువనగిరి, జనగామ రైల్వేస్టేషన్లను ఆధునికీకరించాల్సిన అవసరం ఉంది.
- ఈ రెండు స్టేషన్లపై దృష్టి సారించాలి.
రాయగిరి వరకు ఎంఎంటీఎస్ పనుల పొడిగింపుపై వినతి
- ఎంఎంటీఎస్ ను ఘట్ కేసర్ నుంచి రాయగిరి వరకు పొడిగించాల్సిన అవసరం చాలా ఉంది.
- ఎంఎటీఎస్ రెండోదశకు 2/3 వంతున పనులు చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందాలు చేసుకుని ఏళ్లు గడుస్తున్నాయి.
- రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా ఆలస్యం కారణంగా ఇది కార్యరూపం దాల్చడం లేదు.
- కేంద్రం ప్రత్యేక చొరవ తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి భాగస్వామ్యం లేకుండా వెంటనే పనులు ప్రారంభించి పూర్తి చేయాలి.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభ్యర్థనపై కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించినట్లు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు.. కేంద్రమే మొత్తం ఖర్చు భరించి రాయగిరి వరకు ఎంఎంటీఎస్ ఫేజ్-2 పనులు ప్రారంభించి పూర్తి చేసేలా చూస్తామని హామీ ఇచ్చారని,. భువనగిరి, జనగామ రైల్వేస్టేషన్లను కూడా ఆధునికీకరస్తామని చెప్పారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment