ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
సీఎం ఖరారు చేసిన వెంటనే పనులు ప్రారంభం
రూ.400–500 కోట్లతో నిర్మాణం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో నిర్మించబోయే తెలంగాణ భవన్ దేశానికి ఐకానిక్‌గా ఉంటుంద ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. రెండు నెలల్లోగా పనులు ప్రారంభించి రెండేళ్లలోపు నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. హంగూ, ఆర్భా టాలనేవి భవన్ నిర్మాణంలో కనిపించవని.. అయితే ఢిల్లీ వచ్చిన ప్రతి ఒక్కరూ ఆగి మరీ భవ న్‌ను చూసేలా మోడ్రన్‌గా నిర్మిస్తామని వివ రించారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డిజైన్‌ను ఖరా రు చేసిన వెంటనే పనులు ప్రారంభమవు తాయ ని తెలిపారు. బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఏపీ జితేందర్ రెడ్డి బాధ్య తల స్వీకారం కార్యక్రమానికి వచ్చిన కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు.
అదిరిపోయేలా నిర్మాణం
పదేళ్లుగా తెలంగాణకు ఢిల్లీలో భవన్ లేకపోవడం బాధాకరమని కోమటిరెడ్డి పేర్కొ న్నారు. సుమారు రూ.400–500 కోట్ల బడ్జెట్‌తో తెలంగాణ భవన్ అదిరిపోయేలా నిర్మిస్తామని చెప్పారు. రెండు కంపెనీలు బిల్డింగ్ నిర్మాణం గురించి ప్రజెంటేషన్ ఇచ్చాయన్నారు.
వాళ్లు గోపురం టైపులో నిర్మిద్దామనే డిజైన్ ఇవ్వడంతో..తాను కొన్ని మార్పులు చేసినట్లు చెప్పారు. సింపుల్ లుక్‌లో భవన్ అదిరిపోయేలా ఉండాల ని సూచించినట్లు తెలిపారు. అందుకు తగ్గ డిజై న్లు వచ్చిన వెంటనే 2 నెలల్లోపే నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయని వివరించారు. హైదరా బాద్ హౌజ్ పక్కన గవర్నర్, సీఎం బంగ్లాలు నిర్మించాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు.
జగన్ వల్లే పరిష్కారమైంది
రాష్ట్ర విభజన తర్వాత ఢిల్లీలోని ఏపీ భవన్‌కు సంబంధించిన 19 ఎకరాల ఆస్తుల్లో 42% వాటా తెలంగాణకు రావాల్సి ఉందని కోమటిరెడ్డి తెలిపారు. ఈ ఆస్తులను సాధించుకోవడంలో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. పటౌడీ హౌజ్, హైదరాబాద్ హౌజ్‌ల పక్కన స్థలాలు తెలంగాణకు కేటాయించాలంటూ అప్పటి సీఎం వైఎస్ జగన్‌ను తాను కోరడంతో ఆయన వెంటనే ఓకే చేసినట్లు చెప్పారు.
ఆ వెంటనే అప్పటి సీఎస్ జవహర్ రెడ్డితో కూడా మాట్లాడి ఏపీ, తెలంగాణకు కేటాయించాల్సిన ఆస్తులపై చర్చించి కేంద్రానికి తెలిపామన్నారు. కేంద్రం కూడా స్థలాల్ని రెండు రాష్ట్రాలకు విభజన చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు. కేంద్రంతో మంచిగా ఉంటూనే రాష్ట్రానికి రావాల్సిన వాటిపై పోరాడి సాధించుకుంటామన్నారు.
హైదరాబాద్ – విజయవాడ బుల్లెట్ ట్రైన్, కృష్ణా– గోదావరి ట్రిబ్యునల్ వ్యవహారం వంటి సమస్యలకు కేంద్రం నుంచి పరిష్కారాన్ని సాధిస్తామని కోమటిరెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment