![Mp Komatireddy Venkat Reddy Comments On Brs Party - Sakshi](/styles/webp/s3/article_images/2023/10/12/Mp-Komatireddy-Venkat-Reddy.jpg.webp?itok=B25HHlyG)
ఫైల్ ఫోటో
సాక్షి, నల్గొండ: ప్రాణం ఉన్నంత వరకు కాంగ్రెస్‌లోనే కొనసాగతానని, తాను చనిపోయినా నా శవంపై కాంగ్రెస్ జెండానే ఉంటుందన్నారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. గురువారం ఆయన కనగల్ మండలం ధర్వేశిపురంలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ, అభివృద్ధి పనుల కోసం ప్రధానిని కలిస్తే.. బీజేపీలో చేరుతున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘బీఆర్ఎస్‌కు వంతపాడుతున్న అధికారులను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వదలం. ఈ నెల 15న కాంగ్రెస్ మొదటి జాబితా విడుదల చేస్తాం. 75 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుంది’’ అని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
చదవండి: ఈటల రాజేందర్ సంచలన ప్రకటన
Comments
Please login to add a commentAdd a comment