
ఆశ్చర్యంగా ఉంది: జానారెడ్డి
హైదరాబాద్ : టీటీడీపీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో విలీనమైనట్లు స్పీకర్ ప్రకటించడం ఆశ్చర్యంగా ఉందని తెలంగాణ అసెంబ్లీలో సీఎల్పీ నేత కె.జానారెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్లో జానారెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... కాంగ్రెస్ ఎమ్మెల్యేల అనర్హతపై మేమిచ్చిన పిటిషన్ను పెండింగ్లో పెట్టి... విలీనంపై నిర్ణయం తీసుకోవడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.
పెండింగ్ పిటిషన్లను విచారించకుండానే.. ఎర్రబెల్లి పిటిషన్ను ఆమోదించడం ఎంతవరకు సమంజసమన్నారు. స్పీకర్ తీరుపై మా వ్యతిరేకత, నిరసనను తెలియజేస్తున్నామని జానారెడ్డి స్పష్టం చేశారు. టీఆర్ఎస్ తీరుతో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతోందని జానారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.