తండ్రి చివరిచూపుకు రిద్దిమాకు అనుమతి | Riddhima Kapoor Gets Permission To Travel To Mumbai | Sakshi
Sakshi News home page

లాక్‌డౌన్‌.. తండ్రి చివరిచూపుకు రిద్దిమాకు అనుమతి

Published Thu, Apr 30 2020 12:57 PM | Last Updated on Thu, Apr 30 2020 3:10 PM

Riddhima Kapoor Gets Permission To Travel To Mumbai - Sakshi

న్యూఢిల్లీ : ప్రముఖ నటుడు రిషీకపూర్‌ గురువారం ఉదయం అనారోగ్యంతో ముంబైలోని హాస్పిటల్‌లో కన్నుమూశారు. దీంతో ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆయన కుమార్తె రిద్దిమా కపూర్‌ తండ్రి చివరిచూపు తీవ్రంగా ప్రయత్నించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతుండటంతో విమాన సర్వీసులతోపాటుగా అంతరాష్ట్ర ప్రజా రవాణా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న రిద్దిమా తనకు ముంబై వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇందుకోసం ఆమె అధికారులకు దరఖాస్తు కూడా అందజేశారు. దీనిపై స్పందించిన అధికారులు రోడ్డు మార్గంలో ఆమె ముంబై వెళ్లేందుకు అనుమతిచ్చారు. (24 గంటల్లోనే ఇలా జరిగితే ఎలా.. ?)

దీంతో రిద్దిమా రోడ్డు మార్గంలో 1400 కి.మీ ప్రయాణించి ముంబై చేరుకోనున్నారు. ఇందుకు దాదాపు 18 గంటలకుపైగా సమయం పట్టే అవకాశం ఉంది. రిద్దిమా ముంబై చేరకున్నాకే.. రిషీకపూర్‌ అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది. కాగా, ప్యాషన్‌ డిజైనర్‌గా ఉన్న రిద్దిమా.. వ్యాపారవేత్త భరత్‌ సాహ్నిని పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం భర్త, పిల్లలతో కలిసి ఆమె ఢిల్లీలో నివాసం ఉంటున్నారు.మరోవైపు రిషీకపూర్‌కు సోషల్‌ మీడియా వేదికగా సినీ ప్రముఖులు, అభిమానులు నివాళులర్పిస్తున్నారు. కొద్ది సేపటి క్రితం నటి ఆలియా భట్‌ ఆస్పత్రికి వెళ్లి రిషికపూర్‌కు నివాళులర్పించారు.  ( ప్రముఖ నటుడు రిషీకపూర్‌ కన్నుమూత)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement