ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, కృష్ణా : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కన్నతల్లికి తల కొరివి పెట్టకుండా ఓ కొడుకు భార్యా బిడ్డలతో ఇంటినుంచి పరారయ్యాడు. ఈ సంఘటన మచిలీపట్నం జిల్లా కోర్టు సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మచిలీపట్నానికి చెందిన రాజారత్నం అనే మహిళ గత కొద్దిరోజులుగా బంటుమిల్లులోని కూతురు దగ్గర ఉంటోంది. నిన్న రాత్రి ఆమె మరణించింది. దీంతో కూతురు, అల్లుడు శవాన్ని బందరులోని కుమారుడు నాగ వర ప్రసాద్ ఇంటి వద్దకు తీసుకువచ్చారు. ( వేడి వేడి ఉల్లి పకోడిలో కప్ప)
తాను మృతదేహాన్ని ఖననం చేయనంటూ నాగ వర ప్రసాద్ ఇంటికి తాళం వేసుకుని వెళ్లిపోయాడు. ఏఆర్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అతడు.. తమ అక్క, బావలు డబ్బుల కోసం తన తల్లిని చంపారని చిలకపూడి స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తల కొరివి పెట్టాల్సిన కుమారుడు ఇంటికి తాళం వేసి, కుటుంబసభ్యులతో వెళ్లిపోవడటంతో స్థానిక ప్రజలు విస్తుపోతున్నారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ కలుగ జేసుకోవటంతో నాగ వర ప్రసాద్ తన ఫిర్యాదును వెనక్కు తీసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment