
సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో మధ్యాహ్నం 3:45 గంటల సమయంలో ఆయనకు అంత్యక్రియలు పూర్తయ్యాయి. కుటుంబ సభ్యులు, అభిమానులు అశ్రునయనాలతో ఆయనకు వీడ్కోలు పలికారు. మహాప్రస్థానంలో కృష్ణకు ప్రభుత్వ లాంఛనాల మధ్య అంత్యక్రియలు జరిగాయి. గౌరవ వందనం అనంతరం పోలీసులు మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు.
ఇక ఆయన అంత్యక్రియల్లో ఘట్టమనేని కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. చివరి సారిగా తమ అభిమాన నటుడిని చూసేందుకు వేలాది సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. బుధవారం పద్మాలయ స్టూడియోస్ నుంచి జూబ్లీహిల్స్ మహాప్రస్థానానికి కృష్ణ అంతిమయాత్ర జరిగింది. కాగా ఆదివారం గుండెపోటుతో హైదరాబాద్ ఆస్ప్రతిలో చేరిన కృష్ణ చికిత్స పొందుతూ మంగళవారం(నవంబర్ 15న) తుదిశ్వాస విడిచారు. కృష్ణ మరణాన్ని ఇప్పటికి సినీ ఇండస్ట్రీలో పాటు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment