
తండ్రి మృతిపై సూపర్ స్టార్ మహేశ్ బాబు భావోద్వేగానికి లోనయ్యారు. ఇటీవల నవంబర్ 15న సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా తండ్రి మరణాన్ని తలుకుంటూ మహేశ్ బాబు సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. ‘మీ జీవితాన్ని ఎంతో ఆనందంగా, ఉత్సాహాంగా గడిపారు. మీరు మీ జీవితాన్ని నిర్భయంగా గడిపారు. ధైర్యం, సాహసం మీ వ్యక్తిత్వం.
మీలో నాకు స్ఫూర్తినిచ్చిన అంశాలన్నీ మీతోనే వెళ్లిపోయాయి. నాకిప్పుడు ఎలాంటి భయం లేదు. ఇంతకుముందెన్నడూ లేని బలం నాలో ఉన్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే మీ కాంతి నాలో ఎప్పటికి ప్రకాశిస్తూనే ఉంటుంది. మీ వారసత్వాన్ని కొనసాగిస్తాను. మీరు మరింత గర్వపడేలా చేస్తాను. లవ్ యూ నాన్న.. మై సూపర్‌స్టార్’ అంటూ మహేశ్ బాబు తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.
చదవండి:
ఘనంగా అలీ కూతురు హల్దీ ఫంక్షన్, ఫొటోలు వైరల్
హీరోయిన్స్ కంటే అందంగా కనిపిస్తున్నానని పక్కన పెడుతున్నారు: ‘యశోద’ నటి
Comments
Please login to add a commentAdd a comment