Viral: Gautham Ghattamaneni Shares Emotional Post On Grand Father Superstar Krishna Death - Sakshi
Sakshi News home page

Super Star Krishna-Gautham: అది మాటల్లో చెప్పలేను: తాత మృతిపై గౌతమ్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

Published Thu, Nov 17 2022 11:46 AM | Last Updated on Thu, Nov 17 2022 12:31 PM

Gautham Ghattamaneni Pen Emotional Note on Grand Father Krishna Death - Sakshi

తాత సూపర్‌ కృష్ణ మృతిపై మహేశ్‌ బాబు తనయుడు గౌతమ్‌ ఘట్టమనేని భావోద్వేగాని గురయ్యాడు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ షేర్‌ చేస్తూ తాతతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నాడు. తాతయ్య, సోదరి సీతారతో ఉన్న ఫొటోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ.. “మీరు ఎక్కడ ఉన్నా నేను నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను. అలాగే నువ్వు కూడా నన్ను ప్రేమిస్తుంటావని తెలుసు. మిస్‌ యూ తాతగారు. మాటల్లో చెప్పలేనంతగా మిమ్మల్ని మిస్‌ అవుతున్నా” అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. కాగా సోషల్‌ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉండని గౌతమ్‌ తాత ప్రతి పుట్టిన రోజుకు ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ ప్రేమను వ్యక్తం చేశాడు.

చదవండి: ఇకపై అవేవి ఇంతకు ముందులా ఉండవు, మిస్‌ యూ తాతయ్య: సితార ఎమోషనల్‌

తాత కృష్ణ అంటే గౌతమ్‌కు ఎంత ఇష్టమో అతడి పాత పోస్టులను చూస్తే అర్థమవుతోంది. అలాగే కృష్ణకు కూడా గౌతమ్‌ అంటే ఇష్టమని, మనవడితో కలిసి నటించాలని ఉందని ఆయన పలు ఇంటర్య్వూలో మనసులో మాట చెప్పిన సంగతి తెలిసిందే. కాగా ఆదివారం రాత్రి గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన కృష్ణ చికిత్స పొందతూ మంగళవారం(నవంబర్‌ 15) తెల్లవారుజాము తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో ఘట్టమనేని కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నిన్న బుధవారం జూబ్లిహిల్స్‌లోని మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంచనాల మధ్య కృష్ణ అంత్యక్రియలు జరిగాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement