mahaprasthanam
-
అంత్యక్రియలు చేశారు.. అస్థికలు మరిచారు
సాక్షి, హైదరాబాద్: రాయదుర్గంలోని (జూబ్లిహిల్స్ రోడ్డు) వైకుంఠ మహాప్రస్థానంలో శాస్త్రోక్తంగా జలాల్లో కలపాల్సిన అస్థికలు ఏళ్లుగా అక్కడే ఉండిపోతున్నాయి. కొందరు మృతుల బంధువులు వాటిని తీసుకుపోకుండా అస్థికలు భద్రపరిచే రూంలోనే అమానవీయంగా వదిలేస్తుండటమే దీనికి కారణం. దాదాపు నాలుగేళ్ల నుంచి పలువురి అస్థికలు నిలువ ఉంటున్నాయి. దీంతో మహాప్రస్థానం ట్రస్టు స్పందించింది. అంత్యక్రియలు నిర్వహించి చాలాకాలంగా వదిలేసిన అస్థికలను సంబంధితులు తీసుకువెళ్లాలని రాయదుర్గంలోని వైకుంఠ మహాప్రస్థానం ట్రస్టు తెలిపింది. అంతిమ సంస్కారాలు చేసిన పలువురి అస్థికలు 2019 నుంచి మహాప్రస్థానంలోని గదిలోనే ఉండిపోతున్నాయని పేర్కొంది. అస్థికలను తీసుకుపోకుండా అలాగే ఉంచడం సరికాదని వివరించింది. కరోనా సమయంలోనూ చాలా మంది అంతిమ సంస్కారాలు మహాప్రస్థానంలో జరిగాయి. అప్పటినుంచీ కొందరి అస్థికలు అలాగే ఉంటున్నాయి. దీంతో మహాప్రస్థానం ట్రస్టు స్పందించి.. ఈ నెల 30నాటికి అస్థికలను సంబంధికులు తీసుకువెళ్లాలని సూచించింది. లేని పక్షంలో అక్టోబర్ 14న ట్రస్టు ఆద్వర్యంలో సంప్రదాయబద్దంగా పూజా క్రతువులు నిర్వహించి, జలాల్లో కలుపుతామని స్పష్టం చేశారు. వివరాలకు 9703153111, 9703158111 నెంబర్లకు సంప్రదించాలని కోరారు. ఇదీ చదవండి: సెల్‌ఫోన్ వాడొద్దన్నందుకు బాలిక ఆత్మహత్య -
జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు
-
సోమవారం తారకరత్న అంత్యక్రియలు
'ఒకటో నెంబర్ కుర్రాడు'తో వెండితెరపై అడుగుపెట్టి పలు సినిమాలు చేసిన టాలీవుడ్ నటుడు నందమూరి తారకరత్న శనివారం రాత్రి కన్నుమూశారు. ఆయన భౌతిక కాయాన్ని రంగారెడ్డి జిల్లా మోకిల గ్రామంలో తన నివాసానికి తరలించనున్నారు. సోమవారం ఉదయం ఆయన భౌతిక కాయాన్ని ఫిలిం ఛాంబర్‌కు తరలిస్తారు. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అభిమానులు, ప్రజల సందర్శనార్థం అక్కడే ఉంచుతారు. అనంతరం సాయంత్రం ఐదు గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరపనున్నారు. కాగా గత నెల 27న నారా లోకేశ్ ప్రారంభించిన యువగళం పాదయాత్రలో తారకరత్న గుండెపోటుతో కుప్పకూలారు. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి ప్రాథమిక వైద్యం అందించారు. మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలకు తరలించారు. అక్కడ 23 రోజులపాటు మృత్యువుతో పోరాడిన ఆయన చివరకు తుదిశ్వాస విడిచారు. చదవండి: వైరల్‌గా మారిన తారకరత్న చివరి వీడియో -
మహాప్రస్థానంలో చలపతిరావు అంత్యక్రియలు పూర్తి
-
మహా ప్రస్థానంలో ముగిసిన కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు (ఫొటోలు)
-
ప్రభుత్వ లాంఛనాలతో కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు
-
కైకాల నివాసం నుండి ప్రారంభమైన అంతిమ యాత్ర
-
పెద్ద కొడుకు చేతుల మీదుగా కైకాల అంత్యక్రియలు
Kaikala Satyanarayana Funeral Live Updates: ►కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు ముగిశాయి. హిందూ సాంప్రదాయ పద్దతిలో తంతు ముగించారు. ►కైకాల సత్యన్నారాయణకు అంతిమ సంస్కారాలు నిర్వహించిన పెద్ద కుమారుడు లక్ష్మి నారాయణ ►చివరిచూపు కోసం తండోపతండాలుగా వచ్చిన కైకాల అభిమానులు.. ► మహా ప్రస్థానంలో కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు ► కైకాల భౌతికకాయానికి సినీ, రాజకీయ ప్రముఖుల నివాళులు ► కైకాల సత్యనారాయణ అంతిమ యాత్ర ప్రారంభమైంది. ప్రభుత్వ లాంఛనాలతో మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలను నిర్వహించనున్నారు. నవరస నటనా సార్వభౌముడు కైకాల సత్యనారాయణ మృతితో టాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మృతి పట్ల ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కైకాల శుక్రవారం తెల్లవారుజామున ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలోనే తుదిశ్వాస విడిచారు. అయితే నేడు(శనివారం)ఉదయం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. అభిమానుల సందర్శనార్థం భౌతికకాయన్ని 10.40కి ఫిలిం చాంబర్‌కు తరలించనున్నారు. అటు నుంచి 11.30గంటలకు మహాప్రస్థానంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ లాంఛనాలతో కైకాల అంత్యక్రియలు జరగనున్నాయి. -
జోహార్ నటశేఖరా! హీరో కృష్ణకు కన్నీటి వీడ్కోలు
హఫీజ్‌పేట్ (హైదరాబాద్): లక్షలాది మంది అభిమానుల కన్నీటి వీడ్కోలు నడుమ సూపర్‌స్టార్ ఘట్టమనేని కృష్ణ అంత్యక్రియలు బుధవారం సాయంత్రం రాయదుర్గంలోని వైకుంఠ మహా ప్రస్థానం మోక్షఘాట్‌లో ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా నిర్వహించారు. అభిమానులు, ఆత్మీయుల అశ్రునయనాల మధ్య తెలుగు తెరపై ‘ఎవర్గ్రీన్ సూపర్‌స్టార్’ భువి నుంచి దివికేగారు. అంతకుముందు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించారు. సీనియర్ పోలీస్ అధికారులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. బ్రాహ్మణుల మంత్రోచ్ఛారణల మధ్య సంప్రదాయ క్రతువును నిర్వహించారు. కృష్ణ చితికి ఆయన కుమారుడు మహేశ్‌బాబు నిప్పంటించారు. కుటుంబసభ్యులు, సినీ, రాజకీయరంగ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేలాదిమంది ప్రజలు అశ్రునయనాలతో తమ అభిమాన నటుడికి అంతిమ వీడ్కోలు పలికారు. అంతకుముందు పూలతో ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో కృష్ణ పార్థివదేహాన్ని ఉంచి పద్మాలయ స్టూడియో నుంచి మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర నిర్వహించారు. కుటుంబసభ్యులు, బంధువులు, సినీ, రాజకీయ ప్రముఖులు బారులు తీరిన కార్లలో ఊరేగింపును అనుసరించారు. పెద్దసంఖ్యలో ప్రజలు జేజేలు పలుకుతూ మహాప్రస్థానానికి చేరుకున్నారు. పరిమిత సంఖ్యలో లోపలికి అనుమతి వైకుంఠ మహాప్రస్థానంలోకి వెళ్లేందుకు పోలీసులు తొలుత పరిమిత సంఖ్యలోనే అనుమతించారు. మహేష్‌బాబు, కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు, కుమార్తెలు మంజుల, ప్రియదర్శిని, పద్యావతితో పాటు నటుడు నరేష్, సుధీర్‌బాబు, సంజయ్, గల్లా జయదేవ్ తదితర సమీప బంధువులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, పువ్వాడ అజయ్‌కుమార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు అంబటి రాంబాబు, చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణలతో పాటు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, నందిగామ ఎమ్మెల్సీ అరుణ్, కాంగ్రెస్ నాయకుడు వి.హన్మంతరావు, సినీ ప్రముఖులు మురళీమోహన్, దిల్‌రాజు, శివపార్వతి తదితరులు కూడా లోనికి వెళ్లారు. అభిమానులు, సామాన్య ప్రజలను మాత్రం క్రతువు ముగిసే వరకు అనుమతించలేదు. దీంతో మహాప్రస్థానం పరిసరాలన్నీ జనçసంద్రంగా మారి పోయాయి. నినాదాలతో మారుమ్రోగిన పరిసరాలు భారీగా గుమిగూడిన అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ‘కృష్ణ అమర్ రహే, సూపర్‌స్టార్ కృష్ణ అమర్ రహే, జోహర్ కృష్ణ, జై కృష్ణ..జైజై కృష్ణ ’ అంటూ హోరెత్తించారు. ఒక దశలో వారిని నియంత్రించడం పోలీసులకు కష్టసాధ్యంగా మారింది. కుటుంబసభ్యులు, ప్రముఖులు వెళ్లిపోయిన తర్వాత అభిమానులను అనుమతించారు. ఏర్పాట్లు పర్యవేక్షించిన మంత్రి తలసాని కృష్ణ అంత్యక్రియల ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ దగ్గరుండి పర్యవేక్షించారు. అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో ఆయన ముందుగానే మహాప్రస్థానానికి చేరుకుని పోలీసులు, అధికారులకు పలు సూచనలు చేశారు. గవర్నర్ సహా ప్రముఖుల నివాళులు కృష్ణ పార్థివ దేహానికి సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో పాటు ఆయన సతీమణి వసుంధర, కుమార్తె బ్రాహ్మణి నివాళులర్పించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, నిర్మాత అల్లు అరవింద్, నటుడు కోట శ్రీనివాసరావు, సినీ నటి జయప్రద, ఏపీ మంత్రి రోజా, రచయిత పరుచూరి గోపాలకృష్ణ తదితరులు కృష్ణ భౌతికకాయయాన్ని సందర్శించారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో అంతిమయాత్ర మొదలైంది. సాయంత్రం 4 గంటల సమయంలో అంత్యక్రియలు ముగిసాయి. ఇదీ చదవండి: సీఎంకు కాల్చేసి నా కుమార్తె పెళ్లికి రావొద్దన్న కృష్ణ.. అసలు విషయం ఏంటంటే.. -
అశ్రునయనాల మధ్య ముగిసిన కృష్ణ అంత్యక్రియలు
సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో మధ్యాహ్నం 3:45 గంటల సమయంలో ఆయనకు అంత్యక్రియలు పూర్తయ్యాయి. కుటుంబ సభ్యులు, అభిమానులు అశ్రునయనాలతో ఆయనకు వీడ్కోలు పలికారు. మహాప్రస్థానంలో కృష్ణకు ప్రభుత్వ లాంఛనాల మధ్య అంత్యక్రియలు జరిగాయి. గౌరవ వందనం అనంతరం పోలీసులు మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. ఇక ఆయన అంత్యక్రియల్లో ఘట్టమనేని కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. చివరి సారిగా తమ అభిమాన నటుడిని చూసేందుకు వేలాది సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. బుధవారం పద్మాలయ స్టూడియోస్ నుంచి జూబ్లీహిల్స్ మహాప్రస్థానానికి కృష్ణ అంతిమయాత్ర జరిగింది. కాగా ఆదివారం గుండెపోటుతో హైదరాబాద్ ఆస్ప్రతిలో చేరిన కృష్ణ చికిత్స పొందుతూ మంగళవారం(నవంబర్ 15న) తుదిశ్వాస విడిచారు. కృష్ణ మరణాన్ని ఇప్పటికి సినీ ఇండస్ట్రీలో పాటు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
పేదల వకీల్ తరిమెల బాలిరెడ్డి కన్నుమూత
సాక్షి, అమరావతి: పేదల న్యాయవాదిగా పేరుగాంచిన ప్రముఖ సీనియర్ న్యాయవాది తరిమెల బాలిరెడ్డి (90) ఆదివారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. గత కొద్ది కాలంగా ఆయన వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. బాలిరెడ్డి 1931, ఏప్రిల్ 22న అనంతపురం జిల్లా శింగనమల మండలం జలాల్‌పురంలో జన్మించారు. పుణెలో ఎల్ఎల్బీ చదివిన ఆయన సుప్రీంకోర్టు దివంగత న్యాయమూర్తి జస్టిస్ ఒ.చిన్నపరెడ్డి వద్ద వృత్తిలో మెళకువలు నేర్చుకున్నారు. అతి తక్కువ కాలంలోనే క్రిమినల్ కేసులపై మంచిపట్టు సాధించారు. వేళ్ల మీద లెక్కించగలిగిన ప్రముఖ క్రిమినల్ న్యాయవాదుల్లో ఒకరిగా పేరుగాంచారు. న్యాయవాదులను పెట్టుకునే స్థోమత లేని ఖైదీలు న్యాయసాయం కోరుతూ బాలిరెడ్డికి లేఖలు రాసేవారు. ఆ లేఖలకు ఆయన తిరిగి సమాధానం ఇచ్చి.. ఆ ఖైదీల కేసులను ఉచితంగా వాదించేవారు. పేదవారి నుంచి పైసా కూడా ఫీజు తీసుకునేవారు కాదు. చాలా సందర్భాల్లో తన సొంత ఖర్చులు వెచ్చించేవారు. దీంతో ఆయన పేదల న్యాయవాదిగా కీర్తిగడించారు. అనేక కీలక కేసుల్లో తన వాదనలు వినిపించారు. న్యాయ కోవిదుడు చాగరి పద్మనాభరెడ్డి, బాలిరెడ్డిలు సుదీర్ఘకాలంపాటు క్రిమినల్ కేసుల విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు మూలస్తంభాలుగా ఉన్నారు. న్యాయమూర్తులు సైతం క్రిమినల్ కేసులకు సంబంధించి వీరిద్దరిని సంప్రదించి తమ సందేహాలను నివృత్తి చేసుకునేవారు. బాలిరెడ్డికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు టి.విజయ్‌కుమార్ చార్టర్డ్ అకౌంటెంట్ కాగా మరో కుమారుడు నరేష్కుమార్ ఇంజనీర్. బాలిరెడ్డి మేనల్లుడు జస్టిస్ కంచిరెడ్డి సురేశ్‌రెడ్డి ప్రస్తుతం హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. బాలిరెడ్డి మృతికి ఏపీ, తెలంగాణ హైకోర్టులకు చెందిన పలువురు సీనియర్ న్యాయవాదులు తమ సంతాపం తెలియచేశారు. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ జూబ్లీహిల్స్ మహాప్రస్థానం శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. -
హీరో శ్రీకాంత్‌కు సినీ ప్రముఖులు పరామర్శ
-
శ్రీకాంత్‌కు చిరంజీవి పరామర్శ
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ హీరో శ్రీకాంత్‌ను మెగాస్టార్ చిరంజీవి సోమవారం పరామర్శించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీకాంత్ తండ్రి మేక పరమేశ్వరరావు నిన్న(ఆదివారం) రాత్రి మృతి చెందిన విషయం తెలిసిందే. పలువురు చలన చిత్ర ప్రముఖులు శ్రీకాంత్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. మెగాస్టార్ చిరంజీవి సోమవారం శ్రీకాంత్ ఇంటికి వెళ్లి ఆయన తండ్రి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. శ్రీకాంత్‌ను, ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చారు. (చదవండి : నటుడు శ్రీకాంత్‌కు పితృ వియోగం) కాగా, ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న మేక పరమేశ్వరరావు గత నాలుగు మాసాలుగా స్టార్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య ఝాన్సీ లక్ష్మి, కుమార్తె నిర్మల, కుమారులు శ్రీకాంత్, అనిల్ ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల తరువాత మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలియజేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నటుడు శ్రీకాంత్ తండ్రి మృతి
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ కథానాయకుడు శ్రీకాంత్‌కు పితృ వియోగం కలిగింది. ఆయన తండ్రి మేక పరమేశ్వరరావు నిన్న (ఆదివారం) రాత్రి 11 గంటల 45 నిమిషాలకు తుది శ్వాస విడిచారు. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న మేక పరమేశ్వరరావు గత నాలుగు మాసాలుగా స్టార్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. 1948 మార్చి 16వ తేదీన కృష్ణాజిల్లా మేకావారి పాలెంలో జన్మించిన పరమేశ్వరరావు కర్ణాటక లోని గంగావతి జిల్లా బసవ పాలెంకు వలస వెళ్లారు. ఆయనకు భార్య ఝాన్సీ లక్ష్మి, కుమార్తె నిర్మల, కుమారులు శ్రీకాంత్, అనిల్ ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల తరువాత మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలియజేశారు. మరోవైపు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శ్రీకాంత్‌కు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
హరికృష్ణ చితికి నిప్పంటించిన కల్యాణ్‌రామ్
-
ముగిసిన హరికృష్ణ అంత్యక్రియలు
సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ మాజీ ఎంపీ, ప్రముఖ నటుడు నందమూరి హరికృష్ణ అంత్యక్రియలు గురువారం సాయంత్రం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అధికార లాంఛనాలతో ముగిశాయి. హరికృష్ణ చివరిచూపు కోసం అభిమానులు భారీగా తరలివచ్చారు. కుటుంబసభ్యులు, అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు హరికృష్ణకు చివరిసారి కన్నీటి నివాళులర్పించారు. హరికృష్ణ తనయులు కళ్యాణ్‌రామ్, జూనియర్ ఎన్టీఆర్‌లు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. హరికృష్ణ చితికి కళ్యాణ్‌రామ్ నిప్పంటించారు. హరికృష్ణ గౌరవార్థం పోలీసులు మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. అంతకుముందు అశ్రునయనాల మధ్య హరికృష్ణ అంతిమయాత్ర సాగింది. మెహిదీపట్నంలోని హరికృష్ణ స్వగృహం నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర సరోజిని దేవి కంటి ఆస్పత్రి, రేతిబౌలి, నానల్‌నగర్, టోలిచౌకి ఫ్లైఓవర్, కేఎఫ్‌సీ, అర్చెన్ మార్బెల్స్, షేక్‌పేట్‌నాలా, ఒయాసిస్ స్కూల్, విస్పర్ వ్యాలీ జంక్షన్, జేఆర్సీ కన్వెన్షన్ మీదుగా మధ్యాహ్నం మహాప్రస్థానానికి చేరుకుంది. దాదాపు గంటన్నరపాటు అంతిమయాత్ర సాగింది. ‘రథసారధి’కి అభిమానులు కడసారి వీడ్కోలు పలికారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అప్డేట్స్: హరన్నా.. ఇక సెలవు
సాక్షి, హైదరాబాద్ : రాజ్యసభ మాజీ ఎంపీ, సినీ నటుడు నందమూరి హరికృష్ణ భౌతికకాయానికి గురువారం సాయంత్రం అంత్యక్రియలు ముగిసిశాయి. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అధికారిక లాంఛనాలతో హరికృష్ణ అంత్యక్రియలను నిర్వహించారు. మెహిదీపట్నంలోని నందమూరి హరికృష్ణ స్వగృహం నుంచి మహాప్రస్థానం వరకు అంతకుముందు అంతిమయాత్ర అశ్రునయనాల మధ్య సాగింది. అంతిమయాత్రకు సంబంధించిన అప్డేట్స్ ఇవి.. సాయంత్రం 4.20 గంటలు: మహాప్రస్థానంలో అధికార లాంఛనాలతో హరికృష్ణ అంత్యక్రియలు పూర్తయ్యాయి. నందమూరి కళ్యాణ్‌రామ్, జూనియర్ ఎన్టీఆర్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. మధ్యాహ్నం 3.25 గంటలు: నందమూరి హరికృష్ణ అంతిమయాత్ర జూబ్లీహిల్స్ మహాప్రస్థానం చేరుకుంది. మరికాసేపట్లో అధికార లాంఛనాలతో హరికృష్ణ అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. దాదాపు గంటన్నరపాటు హరికృష్ణ అంతిమయాత్ర కొనసాగింది. మధ్యాహ్నం 2.30 గంటలు: మెహిదీపట్నంలోని స్వగృహం నుంచి ప్రారంభమై హరికృష్ణ అంతిమయాత్ర కుటుంబసభ్యుల, అభిమానుల అశ్రునయనాల మధ్య కొనసాగుతోంది. మధ్యాహ్నం 2 గంటలు : నటుడు నందమూరి హరికృష్ణ అంతిమయాత్ర ప్రారంభమైంది. మెహిదీపట్నంలోని హరికృష్ణ స్వగృహం నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర సరోజిని దేవి కంటి ఆస్పత్రి, మెహదీపట్నం, రేతిబౌలి, నానల్‌నగర్, టోలిచౌకి ఫ్లైఓవర్, కేఎఫ్‌సీ, అర్చెన్ మార్బెల్స్, షేక్‌పేట్‌నాలా, ఒయాసిస్ స్కూల్, విస్పర్ వ్యాలీ జంక్షన్ మీదుగా.. కుడివైపునకు తిరిగి జేఆర్సీ కన్వెన్షన్ మీదుగా మహాప్రస్థానానికి చేరుకోనుంది. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మహాప్రస్థానంలో అధికార లాంఛనాలతో హరికృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి. మధ్యాహ్నం 12.30 గంటలు: నందమూరి హరికృష్ణ భౌతికకాయానికి వైఎస్సార్సీపీ నేతలు నివాళులర్పించారు. మెహిదీపట్నంలో హరికృష్ణ నివాసానికి వెళ్లిన పార్టీ నేతలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, అంబటి రాంబాబు, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హరికృష్ణకు శ్రద్ధాంజలి ఘటించి.. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. ఉదయం 11.30 గంటలు: నందమూరి హరికృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించేందుకు రాజకీయ, సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున మెహిదీపట్నంలోని ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. మరోవైపు అభిమానులు కూడా భారీ సంఖ్యలో వస్తుండటంతో.. ఇక్కడ రద్దీని నియంత్రించేందుకు పోలీసులు పలు చర్యలు చేపట్టారు. హరికృష్ణ ఇంటికి వెళ్ళే మార్గాన్ని పోలీసులు మూసివేశారు. బంధువులను మాత్రమే ఇంట్లోకి అనుమతిస్తున్నారు. అభిమానులు అంత్యక్రియలు జరిగే జుబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానం శ్మశానవాటికకు చేరుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఉదయం 10 గంటలు: హరికృష్ణ భౌతికకాయానికి టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్, సినీ నటుడు కోట శ్రీనివాస రావు, టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యలు నివాళులు అర్పించారు. అనంతరం డీఎస్ మాట్లాడుతూ.. హరికృష్ణ మృతి చాలా బాధాకరం, దురదృష్టకరమన్నారు. ఆయన తనను చాలా అభిమానించేవారని తెలిపారు. ఆయన మాట్లాడుతుంటే చాలా మంచిగా అనిపించేదని గుర్తు చేసుకున్నారు. మంచి మిత్రుడుగా ఉండేవారని పేర్కొన్నారు. కోట శ్రీనివాస రావు మాట్లాడుతూ..హరికృష్ణతో నా అనుబంధం ఇప్పటిది కాదని తెలిపారు. ఆయన మరణం తీరని లోటని వ్యాఖ్యానించారు. సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ..హరికృష్ణ, తన నియోజకవర్గంలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణకు వచ్చారని వెల్లడించారు. చంద్రబాబు బస్సు యాత్రలో, సత్తుపల్లిలో జరిగిన సమావేశాల్లో హరికృష్ణని కలిశానని గుర్తు చేసుకున్నారు. ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి హరికృష్ణ అని కొనియాడారు. ఉదయం 9 గంటలు: హరికృష్ణ నివాసానికి చేరుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. హరికృష్ణ పార్థివదేహానికి నివాళులు.. ఈ సందర్భంగా హరికృష్ణతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని.. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించిన వెంకయ్యనాయుడు. హరికృష్ణ పార్థివదేహానికి ఎంపీ కవిత, నాగార్జున, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, జగపతిబాబు, అశ్వనీదత్ నివాళులర్పించారు. ఉదయం 8.30.. పలు చోట్ల నిదానంగా కదులుతున్న వాహనాలు పలు ప్రాంతాల్లో ట్రాఫ్‌క్ జామ్ ఏర్పడింది. లకిడికపూల్ ఫ్లైఓవర్, మహవీర్ ఆస్పత్రి, మాసబ్ ట్యాంక్ టవర్స్ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నార్త్ జోన్ డీసీపీ ఆఫీస్ నుంచి వైఎంసీఏ ఫ్లైఓవర్, ఎస్బీహెచ్ క్రాస్‌రోడ్, ప్లాజా క్రాస్‌రోడ్ ప్రాంతల్లో వాహనాలు నిదానంగా కదులుతున్నాయి. హరికృష్ణ అంతిమ యాత్ర నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. హరికృష్ణ అంతిమ యాత్ర దృష్ట్యా పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మాసబ్ ట్యాంక్ నుంచి సరోజిని ఆస్పత్రి మార్గంలో వెళ్లే వాహనదారులు బజార్‌ఘట్, ఆసిఫ్‌నగర్ మీదుగా వెళ్లాలని సూచించారు. గచ్చిబౌలి నుంచి వచ్చేవారు ఫిల్మ్‌నగర్ మీదుగా వెళ్లాలని ఆంక్షలు విధించారు. మెహదీపట్నం ఎన్‌ఎండీసీలోని హరికృష్ణ ఇంటి నుంచి అంతిమయాత్ర ప్రారంభమవుతోంది. సరోజిని దేవి కంటి ఆస్పత్రి, మెహదీపట్నం, రేతిబౌలి, నానల్‌నగర్, టోలిచౌకి ఫ్లైఓవర్, కేఎఫ్‌సీ, అర్చెన్ మార్బెల్స్, షేక్‌పేట్‌నాలా, ఒయాసిస్ స్కూల్, విస్పర్ వ్యాలీ జంక్షన్ మీదుగా.. కుడివైపునకు తిరిగి జేఆర్సీ కన్వెన్షన్ మీదుగా మహాప్రస్థానానికి చేరుకోనున్న అంతిమయాత్ర. సాయంత్రం హరికృష్ణ అంత్యక్రియలు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సాహిత్య మరమరాలు
ఒకసారి శ్రీరంగం శ్రీనివాసరావూ, అబ్బూరి వరద రాజేశ్వరరావూ విశాఖపట్నంలో సముద్రతీరానికి బయల్దేరారు. ‘నువ్వెప్పుడైనా లైట్‌హౌస్ పైకి వెళ్లి సముద్రాన్ని చూశావా?’ అడిగాడు దారిలో వరద. దీపస్తంభాన్ని ఎన్నేళ్లనుంచో చూస్తున్నప్పటికీ అది ఎక్కి సముద్రాన్ని చూడొచ్చన్న ఆలోచన అంతకుముందు రాని శ్రీశ్రీ ఆశ్చర్యపోయాడు. దాని పైకెక్కటం ఎలా అని అడిగాడు. సరాసరి పొన్నాంబళ్ దగ్గరికి పోయారు. అతడు వరదకు పరిచయం. ‘ఇదే ఆఖరు’ అంటూ అతడు ఇద్దరినీ మెలికలు తిరుగుతూ పోయిన మెట్ల మీది నుంచి పైకి తీసుకుపోయాడు. శ్రీశ్రీ సముద్రం వంక చూస్తూ నిశ్చలంగా నిలబడిపోయాడు. తదేక దృష్టితో చూస్తున్నాడు. ఈలోగా వరద బైనాక్యులర్స్ ఇచ్చాడు. అందులోంచి చూశాడు. చూస్తున్నాడు. చూస్తున్నాడు. శ్రీశ్రీ ముఖకవళికలు మారిపోయినై. హఠాత్తుగా ‘పడండి ముందుకు, పడండి తోసుకు పైపైకి’, ‘ఫెళ ఫెళా విరుచుకుపడండి’ ‘వండర్ఫుల్’ అన్న మాటలు ఆయన నోటినుంచి వచ్చినై. కిందికి మెట్లు దిగుతుండగా, ‘ఆ కెరటాల్ని దగ్గరినుంచి చూశావు కదా, ఎలా విరుచుకుపడుతున్నాయో; అంత భయంకర దృశ్యాన్ని చూడటం నాకిదే మొదటిసారి’ అన్నాడు శ్రీశ్రీ. అ తరంగాల్ని చూస్తూ అన్న ఆ మాటలే మరో రెండేళ్లకు మరో రూపంలో శ్రీశ్రీ ప్రసిద్ధ కవితలోని పంక్తులుగా నిలిచినాయి. -
నాకు నచ్చిన ఐదు పుస్తకాలు
చదువరుల శీర్షిక మహాప్రస్థానం (శ్రీశ్రీ) నాలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లినప్పుడల్లా చదివింపజేసి ఆత్మస్థైర్యాన్ని నింపే గొప్ప పుస్తకం. ఎంకి పాటలు (నండూరి సుబ్బారావు) నా పల్లె గురుతుకొచ్చినప్పుడల్లా నేను చదివే మంచి పుస్తకం. నండూరి అద్భుత సృష్టి ‘ఎంకి’వంటి పిల్ల ఇంతవరకు మళ్లీ పుట్టలేదు. బారిష్టర్ పార్వతీశం (మొక్కపాటి నరసింహశాస్త్రి) ఎన్నిసార్లు చదివినా మళ్లీ మళ్లీ చదివింపజేసి కడుపుబ్బ నవ్వించే పుస్తకం. జీవనయానం (దాశరథి రంగాచార్య) చిక్కుల్లో ఎదిగే మనిషి జీవిత సత్యాన్ని చెప్పే గొప్ప అనుభవాత్మకమైన రచన. జీవన పోరాటంలో నన్ను మనిషిని చేసిన రచన. శివతాండవం (పుట్టపర్తి నారాయణాచార్య) లాస్యవిన్యాసాలతో, శబ్ద సౌందర్యాలతో నాలో ఆత్మానందాన్ని కలుగజేసిన విశిష్ట రచన. - తూలుగు రమణారావు 8185818607 -
ముగిసిన సినారె అంత్యక్రియలు
-
ముగిసిన సినారె అంత్యక్రియలు
హైదరాబాద్: ప్రముఖ కవి, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డి అంత్యక్రియలు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ముగిశాయి. సినారె అభిమానుల, కుటుంబీకుల అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు పూర్తయ్యాయి. సాహితీ శిఖరాన్ని కడసారి చూసేందుకు కవులు, రచయితలు, భాషాభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించగా ముఖ్యమంత్రి కేసీఆర్, పలువురు మంత్రులు పాల్గొన్నారు. అంతకుముందు బొగ్గులకుంటలోని సారస్వత్ పరిషత్ నుంచి సినారె అంతిమయాత్ర చేపట్టగా వేలాదిమంది పాల్గొని తుది వీడ్కోలు పలికారు. -
శ్రీశ్రీ నాకు స్ఫూర్తి - సినీ డైరెక్టర్ నల్లపూసల బాబ్జీ
మహాకవి శ్రీశ్రీ... ఈ శతాబ్దం నాదని ఎలుగెత్తి మరీ ప్రకటించిన సాహితీభానుడు.. కవితాగ్నిహోత్రుడు! రెండు శ్రీలు ధరించిన ఈ మహాప్రస్థానయోథుడు తరతరాలుగా తెలుగువారిలో చైతన్యకాంతులు నింపగల స్ఫూర్తివంతుడు. తన ఒక్కో కవితను విప్లవ కేతనంగా మార్చి, ఒక్కో పాటను సాహిత్యపు పూతోటగా తీర్చి, ఒక్కో మాటతో తెలుగుతల్లికి ముత్యాల సరం కూర్చిన శ్రీశ్రీ ఎందరికో నిత్యం స్మరణకు వచ్చే అనితరసాధ్యుడు. ఇలా శ్రీశ్రీ ద్వారా ఉత్తేజితమైన వారెందరిలోనే తానూ ఒకడినని అంటున్నారు సినిమా డెరైక్టర్ నల్లపూసలు బాబ్జీ. ఆయన ఎవరి పెళ్లికి వెళ్లినా, పుట్టినరోజు వేడుకకు వెళ్లినా ఇచ్చే గిఫ్ట్... శ్రీశ్రీ మహాప్రస్థానం మహాకవి స్ఫూర్తితో సామాజిక సమస్యలపై ఆయన కొన్ని వందల పాటలు రాశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది అవార్డు సహా 39 అవార్డులు దక్కించుకున్న నల్లపూసలు వంటి సామాజిక నేపథ్య సినిమాను తొలి ప్రయత్నంలోనే తీసి ఉత్తమ దర్శకుడనిపించుకున్నారు. సామాజిక ప్రయోజనమే లక్ష్యంగా తీస్తున్న వేటకొడవళ్లు షూటింగ్ కోసం వైజాగ్ వచ్చిన ఆయనతో సిటీప్లస్ తో మాట్లాడారు. మహాకవి శ్రీశ్రీ అంటే నాకు ఎంతో ఇష్టం. శ్రీశ్రీ నడయాడిన నేల అనేగాకుండా ఆయనకు రోజుకోవిధంగా కనిపించి మెప్పించిన విశాఖ అన్నా అంతే ఇష్టం. ఈ నేలపై సాహిత్య సౌరభాలు విరబూశాయి. ఎందరో మహనీయులకు జన్మనిచ్చిన విశాఖ, ఉత్తరాంధ్ర అంటే నాకెంతో మక్కువ. అందుకే వైజాగ్‌కు రాకముందే ఈ ప్రాంతానికి అభిమాని అయిపోయాను. శ్రీశ్రీ స్ఫూర్తి మాది ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు. తాత, నాన్న కమ్యూనిస్టు పార్టీలో పనిచేశారు. నేను స్కూల్లో ఉన్నప్పుడే శ్రీశ్రీ మహాప్రస్థానం చదవమని నాన్న చెబుతుండేవారు. తొలుత అందులో భావం నాకు అర్థంగాకపోయినా తర్వాతర్వాత చదువుతున్న కొద్దీ ఏదో ఉత్తేజం నన్ను కదిలించేది. చుట్టూ ఉన్న సమస్యలపై నేనూ స్పందించేవాణ్ణి. క్రమంగా పార్టీ బాట పట్టా. అప్పట్లో నాతోపాటు చాలా మంది చేతుల్లో మహాప్రస్థానం కనిపించేది. ఆ స్ఫూర్తితో నేనూ పాటలు రాశాను. స్టూడెంట్‌గా ఉన్నప్పుడే ఎస్ఎఫ్ఐలో కీలక బాధ్యతలు వహిస్తూనే ప్రజలను చైతన్య పరిచేందుకు ప్రజానాట్యమండలిలో చేరా. నేను రాసిన పాటల్లో వంద వరకూ పాపులర్ అయ్యాయి. మహాప్రస్థానం అద్వితీయం నన్ను నేను తీర్చిదిద్దుకోవడంలో మహాప్రస్థానం పాత్ర కీలకం. అందుకే ఎవరి పెళ్లికి వెళ్లినా, పుట్టినరోజు ఫంక్షన్ అయినా దీన్నే బహుమతిగా ఇస్తా. ఇలా ఇప్పటివరకు ఐదు వేల పుస్తకాలు పంచా. వారు అప్పుడుకాకపోయినా తర్వాత ఏదో ఒక సందర్భంలో మహాప్రస్థానం చదువుతారు. ఆ పుస్తకం ఆలోచింపజేస్తుంది. కదిలిస్తుంది. మార్పు తెస్తుంది. సమాజం కోసం చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. మాదాల రంగారావు సిన్మాలు అప్పట్లో నన్ను చాలా ప్రభావితం చేశాయి. దీంతో స్వీయ దర్శకత్వంలో 1997లో నల్లపూసలు సినిమా తీశా. ఈ చిత్రం నంది సహా 39 అవార్డులు దక్కించుకుంది. ఉత్తమ నూతన దర్శకుడిగా బంగారు నంది అందుకున్నా. భరతముని సహా నాలుగు అవార్డులు, మహానటి సావిత్రి అవార్డు వంటివన్నీ వచ్చాయి. దీంతో నల్లపూసల బాబ్జీగా నా పేరు స్థిరపడిపోయింది. 2000 సంవత్సరంలో ఎన్టీఆర్నగర్ సినిమా తీశా. దక్షిణభారతదేశంలోని ప్రముఖ హీరోల డూప్‌లనే హీరోలుగా చేసి తీసిన తొలి సినిమా ఇదే. దీనికి 18 అవార్డులు వచ్చాయి. అంతేకాదు రాష్ట్రంలో ఉన్న డూప్‌లు చాలామందికి ఉపాధి దొరికింది. తెలుగు సినిమా పితామహుడు రఘుపతి వెంకయ్యనాయుడు జీవితచరిత్ర ఆధారంగా తీస్తున్న సినిమా షూటింగ్ పూర్తిఅయింది. మే నెలలో రిలీజ్ చేస్తాం. ప్రస్తుతం వేటకొడవళ్లు సినిమా షూటింగ్ వైజాగ్‌లో చేస్తున్నాం. వైజాగ్ వాళ్లకు చాన్స్ ఆస్తులు, బ్యాంకు బ్యాలెన్స్‌పైనే కాదు తోటివారిపైనా కాస్త ప్రేమ చూపండనే కాన్సెప్ట్‌తో వేటకొడవళ్లు సినిమా తీస్తున్నాం. దీనిలో సగం మంది విశాఖకు చెందినవారే నటిస్తున్నారు. హీరోలు ఐదుగురు కొత్తవారే. కనిపారేస్తున్నవారే చెత్తకుండీల్లో, రైల్వే స్టేషన్ల్లో అష్టకష్టాల మధ్య పెరిగి యాదృచ్ఛికంగా సంఘ విద్రోహశక్తులుగా ఎలా మారిపోతున్నారో ఈ సినిమాలో చూపిస్తున్నాం.