
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ కథానాయకుడు శ్రీకాంత్‌కు పితృ వియోగం కలిగింది. ఆయన తండ్రి మేక పరమేశ్వరరావు నిన్న (ఆదివారం) రాత్రి 11 గంటల 45 నిమిషాలకు తుది శ్వాస విడిచారు. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న మేక పరమేశ్వరరావు గత నాలుగు మాసాలుగా స్టార్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. 1948 మార్చి 16వ తేదీన కృష్ణాజిల్లా మేకావారి పాలెంలో జన్మించిన పరమేశ్వరరావు కర్ణాటక లోని గంగావతి జిల్లా బసవ పాలెంకు వలస వెళ్లారు. ఆయనకు భార్య ఝాన్సీ లక్ష్మి, కుమార్తె నిర్మల, కుమారులు శ్రీకాంత్, అనిల్ ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల తరువాత మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలియజేశారు. మరోవైపు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శ్రీకాంత్‌కు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment