సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ హీరో శ్రీకాంత్‌ను మెగాస్టార్ చిరంజీవి సోమవారం పరామర్శించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీకాంత్ తండ్రి మేక పరమేశ్వరరావు నిన్న(ఆదివారం) రాత్రి మృతి చెందిన విషయం తెలిసిందే. పలువురు చలన చిత్ర ప్రముఖులు శ్రీకాంత్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. మెగాస్టార్ చిరంజీవి సోమవారం శ్రీకాంత్ ఇంటికి వెళ్లి ఆయన తండ్రి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. శ్రీకాంత్‌ను, ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చారు.
(చదవండి : నటుడు శ్రీకాంత్‌కు పితృ వియోగం)
కాగా, ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న మేక పరమేశ్వరరావు గత నాలుగు మాసాలుగా స్టార్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య ఝాన్సీ లక్ష్మి, కుమార్తె నిర్మల, కుమారులు శ్రీకాంత్, అనిల్ ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల తరువాత మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment