
చదువరుల శీర్షిక
మహాప్రస్థానం (శ్రీశ్రీ)
నాలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లినప్పుడల్లా చదివింపజేసి ఆత్మస్థైర్యాన్ని నింపే గొప్ప పుస్తకం.
ఎంకి పాటలు
(నండూరి సుబ్బారావు)
నా పల్లె గురుతుకొచ్చినప్పుడల్లా నేను చదివే మంచి పుస్తకం. నండూరి అద్భుత సృష్టి ‘ఎంకి’వంటి పిల్ల ఇంతవరకు మళ్లీ పుట్టలేదు.
బారిష్టర్ పార్వతీశం
(మొక్కపాటి నరసింహశాస్త్రి)
ఎన్నిసార్లు చదివినా మళ్లీ మళ్లీ చదివింపజేసి కడుపుబ్బ నవ్వించే పుస్తకం.
జీవనయానం
(దాశరథి రంగాచార్య)
చిక్కుల్లో ఎదిగే మనిషి జీవిత సత్యాన్ని చెప్పే గొప్ప అనుభవాత్మకమైన రచన. జీవన పోరాటంలో నన్ను మనిషిని చేసిన రచన.
శివతాండవం
(పుట్టపర్తి నారాయణాచార్య)
లాస్యవిన్యాసాలతో, శబ్ద సౌందర్యాలతో నాలో ఆత్మానందాన్ని కలుగజేసిన విశిష్ట రచన.
- తూలుగు రమణారావు
8185818607