Ramana Rao
-
పునీత్ రాజ్‌కుమార్‌కు మొదట వైద్యం చేసిన డాక్టర్ ఇంటికి భారీ బందోబస్తు
Puneeth Rajkumar Doctor Gets Police Protection: ప్రముఖ నటుడు పునీత్ రాజ్‌కుమార్ మృతికి వైద్యుని నిర్లక్ష్యం కారణమని కొందరు వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదులు చేయడంతో డా.రాజ్‌కుమార్ కుటుంబ వైద్యుడు డాక్టర్ రమణరావు నివాసం వద్ద పోలీసులు గట్టి భద్రతను కల్పించారు. బెంగళూరు సదాశివనగరలోని రమణరావు ఇల్లు, క్లినిక్ వద్ద శుక్రవారం సాయంత్రం నుంచి భద్రత ఏర్పాటైంది. డాక్టర్ రమణరావు నిర్లక్ష్యం కారణంతో పునీత్ కన్నుమూశారని, ఆయనను అరెస్టు చేయాలనే డిమాండుతో కొన్ని సంఘాలు ఆయన ఇంటి ముందు ధర్నాకు సిద్ధం కావడంతో ఆ ప్రాంతంలో గస్తీని పెంచారు. చదవండి: (50 రకాల వంటకాలతో పునీత్‌కు పాలశాస్త్రం పూజలు) చికిత్సలో లోపం లేదు: రమణరావు.. దీనిపై డా.రమణరావు ముందు నుంచి ఇస్తున్న వివరణనే ఇచ్చారు. పునీత్‌కు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. క్లినిక్‌కు వచ్చిన సమయంలో ప్రాథమిక చికిత్సలు చేశానని రమణరావు తెలిపారు. 35 ఏళ్ల నుంచి తను రాజ్‌కుమార్ కుటుంబానికి వైద్యునిగా పని చేస్తున్నట్లు చెప్పారు. పునీత్‌కు చికిత్సలో తమ వైపు నుంచి ఎలాంటి లోపం జరగలేదని అన్నారు. జిమ్ చేసిన తరువాత సుస్తిగా ఉందని గత నెల 29న ఉదయం 11.15కు పునీత్ మా క్లినిక్‌కు వచ్చారు. ఆయనకు అప్పటికే చెమటలు పట్టిన కారణంగా ఈసీజీ తీశా, గుండెపోటు వచ్చి ఉండవచ్చనే అనుమానంతో తక్షణం యాంజియోగ్రాం చేయటానికి విక్రం ఆస్పత్రికి వెళ్లాలని సూచించా. అయితే అంబులెన్స్ కోసం ఎదురు చూస్తే ఆలస్యం అవుతుందని వారి కారులోనే నాలుగైదు నిమిషాలలో ఆస్పత్రికి వెళ్లేలా చూశాం. అక్కడ చేసిన చికిత్స ఫలించలేని కారణంగా పునీత్ మృతి చెందారు. వైద్యులు ఎక్కడా నిర్లక్ష్యం వహించలేదు అని పేర్కొన్నారు. చదవండి: (పునీత్‌కు ఇలా జరిగిందన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నా: రామ్‌చరణ్) -
తెలుగు సినిమా చేయడం గౌరవంగా భావిస్తున్నా
ప్రముఖ హిందీ నటుడు మిథున్ చక్రవర్తి కుమారుడు మిమో చక్రవర్తి తెలుగు పరిశ్రమకు హీరోగా పరిచయం కాబోతు న్నారు. భోషో సమర్పణలో శ్రీ కళా చిత్ర బ్యానర్‌పై మాధవ్ కోదాడ దర్శకత్వంలో రమణారావు బసవ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘ఎయిర్టెల్ మోడల్’ ఫేమ్ శాషా చైత్రీ కథానాయికగా నటిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఓ పబ్ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. ‘‘తెలుగు పరిశ్రమకు హీరోగా పరిచయం కావడం గౌరవంగా భావిస్తున్నాను. ఈ సినిమా స్క్రిప్ట్ ఆసక్తికరంగా ఉంది’’ అన్నారు మిమో చక్రవర్తి. ‘‘మహేశ్ మంజ్రేకర్, మురళీ శర్మ, బ్రహ్మానందం, అభిమన్యుసింగ్, షిండే, రవి కాలే... ఇలా సినిమాలో భారీ తారాగణం ఉంది. ప్రస్తుతం ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీలో పార్టీ నేపథ్యంలోని పాటను చిత్రీకరిస్తున్నాం’’ అన్నారు మాధవ్ కోదాడ. ‘‘మల్టీ మీడియాలో గోల్డ్ మెడల్ పొందిన వ్యక్తి మాధవ్. తన ఆలోచనలు కొత్తగా ఉంటాయి. ఇప్పటి వరకు 95 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఇంకా ఓ పాట, ఓ ఫైట్ చిత్రీకరిస్తే సినిమా పూర్తవుతుంది. వచ్చే నెలలో ఫస్ట్ లుక్, టైటిల్‌ను ప్రకటిస్తాం. ఏప్రిల్‌లో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు రమణారావు బసవరాజు. ఈ చిత్రానికి సహనిర్మాత: మారుతీ శ్యాం ప్రసాద్‌రెడ్డి, సంగీతం: శేఖర్ చంద్ర. -
ఆర్టీసీకి జాతీయ పురస్కారాలు
సాక్షి, హైదరాబాద్: ఇంధన పొదుపు, వాహన ఉత్పాదకతలో టీఎస్ఆర్టీసీ తన ప్రత్యేకతను నిలబెట్టుకుంది. కొన్నేళ్లుగా ఈ విభాగాల్లో ఉత్తమ రవాణాసంస్థగా పురస్కారాలు సొంతం చేసుకుంటున్న ఆర్టీసీ ఈసారీ అవార్డులను దక్కించుకుంది. 2016–17 ఆర్థిక సంవత్సరానికి గాను పలు విభాగాల్లో ఎంపిక చేసిన రవాణా సంస్థలకు అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్‌టేకింగ్స్ (ఏఎస్ఆర్టీయూ) ఢిల్లీలో జరిగిన 62వ వార్షిక సాధారణ సర్వసభ్య సమావేశంలో పురస్కారాలు ప్రదానం చేసింది. వాహన ఉత్పాదకత, ఇంధన పొదుపులో టీఎస్ఆర్టీసీ ఉత్తమ రవాణా సంస్థగా పురస్కారాలు దక్కించుకుంది. వాహన ఉత్పాదకతలో 318.27 కి.మీ. నుంచి 328.27 కి.మీ.(కి.మీ./వెహికల్/డే)కు మెరుగుపరుచుకుని టాప్‌లో నిలిచింది. ఇక 7,500 వాహనాలు ఉన్న రవాణాసంస్థల కేటగిరీలో ఇంధనపొదుపునకు సంబంధించి 5.51 కేఎంపీఎల్‌తో ఉత్తమంగా నిలిచింది. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ (మోర్త్)కార్యదర్శి యధువీర్సింగ్, సంయుక్త కార్యదర్శి అభయ్ దామ్లేల చేతుల మీదుగా టీఎస్ఆర్టీసీ ఎండీ రమణారావు పురస్కారాలు అందుకున్నారు. అధికారులు, కార్మికుల కృషి వల్లనే పురస్కారాలు సాధించినట్లు ఆయన తెలిపారు. -
నాకు నచ్చిన ఐదు పుస్తకాలు
చదువరుల శీర్షిక మహాప్రస్థానం (శ్రీశ్రీ) నాలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లినప్పుడల్లా చదివింపజేసి ఆత్మస్థైర్యాన్ని నింపే గొప్ప పుస్తకం. ఎంకి పాటలు (నండూరి సుబ్బారావు) నా పల్లె గురుతుకొచ్చినప్పుడల్లా నేను చదివే మంచి పుస్తకం. నండూరి అద్భుత సృష్టి ‘ఎంకి’వంటి పిల్ల ఇంతవరకు మళ్లీ పుట్టలేదు. బారిష్టర్ పార్వతీశం (మొక్కపాటి నరసింహశాస్త్రి) ఎన్నిసార్లు చదివినా మళ్లీ మళ్లీ చదివింపజేసి కడుపుబ్బ నవ్వించే పుస్తకం. జీవనయానం (దాశరథి రంగాచార్య) చిక్కుల్లో ఎదిగే మనిషి జీవిత సత్యాన్ని చెప్పే గొప్ప అనుభవాత్మకమైన రచన. జీవన పోరాటంలో నన్ను మనిషిని చేసిన రచన. శివతాండవం (పుట్టపర్తి నారాయణాచార్య) లాస్యవిన్యాసాలతో, శబ్ద సౌందర్యాలతో నాలో ఆత్మానందాన్ని కలుగజేసిన విశిష్ట రచన. - తూలుగు రమణారావు 8185818607 -
టీఎస్ఆర్టీసీ ఎండీకి అరుదైన గుర్తింపు
ఏఎస్ఆర్టీయూ స్టాండింగ్ కమిటీ చైర్‌పర్సన్‌గా నియామకం సాక్షి, హైదరాబాద్: టీఎస్ఆర్టీసీ ఎండీ రమణారావుకు అరుదైన గుర్తింపు లభిం చింది. అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్టు అండర్‌టేకింగ్స్ (ఏఎస్ఆర్టీ యూ) స్థాయి సంఘం చైర్‌పర్సన్‌గా రమణా రావు నియమితులయ్యారు. రెండేళ్లపాటు ఆయన పదవిలో కొనసాగనున్నారు. రోడ్డు రవాణా సంస్థలు ఉమ్మడిగా అమలు చేయా ల్సిన నిబంధనలు రూపొందించడంలో ఈ స్థాయి సంఘం కీలక పాత్ర పోషిస్తుంది. రోడ్డు రవాణా సంస్థలకు సూచనలు ఇవ్వడం తోపాటు అత్యంత కీలకమైన రవాణా విధానం రూపొందించటంలో కేంద్రానికి సిఫార్సు లు చేస్తుంది. దేశంలోని తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ, ఈశాన్య జోన్ల నుంచి ముగ్గురు చొప్పున, రాష్ట్రం నుంచి ఒకరు మించ కుండా కమిటీలో 15 మంది సభ్యులుంటా రు. దేÔèట్రాన్స్‌పోర్టు పాలసీ రూప కల్పనలో దీనిదే కీలక భూమిక. సబ్సిడీ బస్సులొచ్చేలా కృషి: రమణారావు పట్టణ ప్రాంతాలకు జేఎన్ఎన్యూఆర్ఎం పథకం కింద భారీ సబ్సిడీతో రవాణా బస్సులను కేంద్రం అందిస్తుండటంతో పట్టణ ప్రయాణికులకు రవాణా వసతి మెరుగవు తోందని, గ్రామీణ ప్రాంతాలకు అవకాశం లేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని రమణారావు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలకూ బస్సులు సరఫరా చేసేలా సిఫారసుకు కృషి చేస్తానని చెప్పారు. డిజిటల్ లావాదేవీలు రవాణా సంస్థల్లో అమలయ్యేలా చర్యలు తీసుకుంటానన్నారు. ఆక్యుపెన్సీ రేషియో తక్కువగా ఉందన్న కారణంతో రవాణా సంస్థలు బస్సులను ఉపసంహరించుకుంటున్నాయని, ఇది గ్రామీణ ప్రాంతాలకు శాపంగా మారిందన్నారు. -
బస్ భవన్లో టీఎంయూ విజయోత్సవ సభ
హైదరాబాద్: నగరంలోని బస్ భవన్లో మంగళవారం టీఎంయూ విజయోత్సవ సభను ఏర్పాటు చేశారు. ఈ సభా సమావేశంలో తెలంగాణ మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, హరీశ్ రావు, మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ ఎండీ రమణారావు టీఎంయూకు గుర్తింపు హోదా పత్రాన్ని అందజేశారు. -
టీఎస్ ఆర్టీసీ ఎండీగా రమణారావు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ జేఎండీగా విదులు నిర్వహిస్తున్న రమణారావుకు పదోన్నతి లభించింది. ఆయనను మేనేజింగ్ డైరెక్టర్‌గా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రమణారావు రెండేళ్లపాటు టీఎస్ ఆర్టీసీ ఎండీగా కొనసాగనున్నారు. -
ఏ సెంటర్‌లోనైనా ఎంసెట్ రాయొచ్చు
హైదరాబాద్ : ఎంసెట్ పరీక్షకు నిబంధనలు యథావిధిగా వర్తిస్తాయిని ఎంసెట్ కన్వీనర్ రమణారావు వెల్లడించారు. నిమిషం ఆలస్యమైనా ఎంసెట్ పరీక్షకు విద్యార్థులను అనుమతించేది లేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో గురువారం ఎంసెట్ పరీక్ష జరగనున్న విషయం తెలిసిందే. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఎంసెట్ పరీక్ష నిర్వహణపై ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఇతర ఉన్నతాధికారులు, జేఎన్టీయూ ఉన్నతాధికారులతో బుధవారం సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతర కన్వీనర్ రమణారావు మాట్లాడుతూ... సమ్మె నేపథ్యంలో బస్సుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పరీక్షా కేంద్రానికి సకాలంలో చేరుకునేలా బయలుదేరాలని ఆయన విద్యార్థులకు సూచించారు. హాల్ టిక్కెట్లో ముందుగా ఇచ్చిన సెంటర్లోనే కాకుండా దానికి బదులుగా మరో పరీక్షా సెంటర్లో అయినా పరీక్ష రాసేందుకు విద్యార్థులకు అనుమతి ఇస్తామని రమణారావు తెలిపారు. -
మే 14న తెలంగాణలో ఎంసెట్ పరీక్ష.. 24న ఫలితాలు
హైదరాబాద్: తెలంగాణలో మే 14న ఎంసెట్ పరీక్షను నిర్వహించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ రమణారావు పేర్కొన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 18న ఎంసెట్ కీ, 24న ఎంసెట్ ఫలితాలు విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు. అయితే ఎంసెట్ పరీక్షల నిర్వహణలో భాగంగా ఇంజినీరింగ్ పరీక్షకు 251 సెంటర్లు, మెడికల్ అండ్ అగ్రికల్చరల్ 172 సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. హైదరాబాద్‌ను 8 జోన్లుగా విభజించి విద్యార్థులను సమీప ప్రాంతంలోనే ఎంసెట్ పరీక్ష సెంటర్లు ఏర్పాట్లు చేస్తున్నామని రమణారావు తెలిపారు. -
ఆధునిక పద్ధతిలో మూల్యాంకనం
సమస్యలకు చెక్ పెట్టేందుకే.. జేఎన్టీయూహెచ్లోనే వాల్యుయేషన్ సకాలంలోనే బీటెక్, బీఫార్మసీ ఫలితాల విడుదల సాక్షి, సిటీబ్యూరో: పరీక్షా ఫలితాల విడుదల లో జాప్యంతోపాటు ఎదురయ్యే ఇతర సమస్యలకు చెక్ పెట్టేందుకు మూల్యాంకన విధానంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టినట్టు జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ ఎన్వీ రమణారావు తెలిపారు. శనివారం జేఎన్టీయూహెచ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో తెలంగాణ వ్యాప్తంగా 65 కేంద్రాల్లో మూల్యాంకనం జరిగేదన్నారు. ప్రస్తుతం జేఎన్టీయూహెచ్ వేదికగా ఒకేచోట అన్ని జవాబు పత్రాల మూల్యాంకనం చేస్తున్నందున క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కు ఆధునిక ఏర్పాట్లు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే.. ఈ తరహా టెక్నాలజీ ఒక్క జేఎన్టీయూహెచ్లో మాత్రమే ఉందన్నారు. అంతేకాకుండా జవాబు పత్రాల బండిల్స్ మిస్ కాకుండా అత్యంత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టామన్నారు. తేడాలొస్తే బ్లాక్‌లిస్ట్‌లో.. మూల్యాంకనాన్ని మెరుగైన పద్ధతిలో చేపడుతున్నామని వర్సిటీ పరీక్షల విభాగం డెరైక్టర్ ఈశ్వర్ప్రసాద్ అన్నారు. జవాబు పత్రాన్ని మూడు నిమిషాలలోపు మూల్యాంకనం చేస్తే సర్వర్ అనుమతించదన్నారు. మూల్యాంకనంలో తేడాలను గమనించేందుకు ఒక చీఫ్ ఎగ్జామినర్తోపాటు నలుగురు అదనపు కంట్రోలర్లు ఉంటారన్నారు. ప్రతి బండిల్ నుంచి ర్యాండమ్‌గా రెండేసి పేపర్లు తనిఖీ చేస్తారని, తేడాలున్నట్టు తేలితే రీవాల్యుయేషన్ చేయిస్తామని తెలిపారు. నిర్లక్ష్యం వహించే ఆచార్యులను బ్లాక్ లిస్ట్‌లో పెడతామన్నారు. ఏటా ఫలితాలు వచ్చిన తరువాత కనీసం 15 వేలమంది రీవాల్యుయేషన్, రీకౌంటింగ్లకు దరఖాస్తు చేసుకునేవారని, మూల్యాంకనంలో నాణ్యతను పెంపొందించడంతో రీకౌంటింగ్, రీవాల్యుయేషన్ దరఖాస్తుల సంఖ్య ఈ ఏడాది 1,500కు మించలేదన్నారు. జవాబు పత్రాల మూల్యాంకనం జరుగుతున్న తీరును సీసీటీవీల ద్వారా వీసీ, రిజిస్ట్రార్, రెక్టార్లు తమ చాంబర్నుంచే పర్యవేక్షిస్తారని చెప్పారు. మూల్యాంకనం తరువాత మార్కులను ఎప్పటికప్పుడు ట్యాబ్లెట్ పీసీల్లో నమోదు చేయడం ద్వారా నేరుగా సర్వర్‌కు అనుసంధానం చేశామన్నారు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ఫలితాలను సకాలంలో అందించాలనే ఉద్దేశంతో ఉదయం 9 నుంచి రాత్రి10 గంటల వరకు ఈ కేంద్రం పనిచేస్తుందన్నారు. ఈ సమావేశంలో యూనివర్సిటీ రెక్టార్ టి.కిషన్ కుమార్‌రెడ్డి, వర్సిటీ ఇన్నోవేషన్ టెక్నాలజీ సెంటర్ డెరైక్టర్ మాధవీలత తదితరులు పాల్గొన్నారు. -
జూన్ 9న ర్యాంకులు
* ఎంసెట్ కన్వీనర్ వెల్లడి * పరీక్షకు 94 శాతం విద్యార్థుల హాజరు * 24న ప్రాథమిక కీ సాక్షి, హైదరాబాద్: ఎంసెట్-2014 ర్యాంకులను జూన్ 9న వెల్లడిస్తామని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ రమణరావు తెలిపారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్‌లో ప్రవేశాల కోసం గురువారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన పరీక్షకు మొత్తంగా 94.34 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని పేర్కొన్నారు. పరీక్ష రాసేందుకు 3,95,670 మంది దరఖాస్తు చేసుకోగా 3,73,286 మంది హాజరయ్యారని వెల్లడించారు. ఒక్క ఇంజనీరింగ్‌లోనే 2,82,815 దరఖాస్తు చేసుకోగా 2,66,895 (94.37 శాతం) మంది, అగ్రికల్చర్ అండ్ మెడికల్‌లో 1,12,855 మంది దరఖాస్తు చేసుకోగా 1,06,391 (94.27 శాతం) మంది హాజరయ్యారని వివరించారు. పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీని ఈనెల 24న విడుదల చేస్తామని పేర్కొన్నారు. దానిపై ఈనెల 31 వరకు అభ్యంతరాలు స్వీకరించి జూన్ 9న ర్యాంకులను వెల్లడిస్తామని తెలిపారు. విజయవాడలో అత్యధికంగా హాజరు: ఎంసెట్‌లో మెడికల్ పరీక్షకు విజయవాడలో ఎక్కువ మంది విద్యార్థులు (98.25 శాతం) హాజరయ్యారు. ఇంజనీరింగ్‌లోనూ విజయవాడలో 96.26 శాతం మంది పరీక్ష రాశారు. ఇంజనీరింగ్‌లో తక్కువ హాజరు శాతం ఆదిలాబాద్‌లో (88.31%) నమోదైంది. అగ్రికల్చర్ అండ్ మెడికల్‌లో తక్కువ హాజరు శాతం విజయనగరంలో (88.09%)నమోదైంది. హైదరాబాద్‌లో ఇంజనీరింగ్‌లో 91.67%, అగ్రికల్చర్ అండ్ మెడికల్‌లో 95.09% హాజరు నమోదైంది. కఠినంగా మ్యాథ్స్ పేపర్..: ఎంసెట్ ఇంజనీరింగ్ సబ్జెక్టులో మ్యాథ్స్ ప్రశ్నలు కొంత కఠినంగా వచ్చాయని పలువురు విద్యార్థులు పేర్కొన్నారు. గురువారం జరిగిన ఎంసెట్ పరీక్ష అనంతరం ఇంజనీరింగ్ రాసిన విద్యార్థులు తమకు సమయం సరిపోలేదని తెలిపారు. మ్యాథ్స్‌లో సమస్యలు పెద్దవి ఇవ్వడం.. ఫార్ములా ప్రకారం వాటిని లెక్కించి రాసేందుకు సమయం సరిపోలేదని వెల్లడించారు. అగ్రికల్చర్ అండ్ మెడికల్ అభ్యర్థులకు మ్యాథ్స్ ఉండదు కనుక ఇంజనీరింగ్‌కు ఎక్కువ సమయం ఇవ్వాల్సిందన్నారు. మ్యాథ్స్‌లో సమస్యలు పెద్దవి ఇవ ్వడం వల్ల ఫిజిక్స్, కెమిస్ట్రీ పేపర్లకు టైం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. -
రేపు ఎంసెట్... నేడు పాలిసెట్, పీసెట్ ప్రవేశ పరీక్షలు
* ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ * ఉదయం 10 నుంచి ఒంటిగంట వరకు ఇంజనీరింగ్ పరీక్ష * 2.30 నుంచి 5.30 వరకు అగ్రికల్చర్, మెడిసిన్ పరీక్ష సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్-2014 గురువారం జరుగనుంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు ఎంసెట్ కన్వీనర్ రమణారావు తెలిపారు. ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు ఇంజనీరింగ్ పరీక్ష... మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 గంటలకు వరకు అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్ష ఉంటుందని వెల్లడించారు. ఇంజనీరింగ్ అభ్యర్థులను ఉదయం 9 గంటలకు, అగ్రికల్చర్ అండ్ మెడికల్ వారిని మధ్యాహ్నం 1:30గంటల నుంచే పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని తెలిపారు. పరీక్ష సమయానికి ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా.. హాల్లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. ఎంసెట్‌కు మొత్తంగా 3,94,543 మంది విద్యార్థులు (ఇంజనీరింగ్‌కు 2,81,695 మంది, అగ్రికల్చర్ అండ్ మెడికల్‌కు 1,11,777 మంది) హాజరుకానున్నట్లు తెలిపారు. ఆన్లైన్ పూర్తి చేసిన దరఖాస్తు ఫారాన్ని పరీక్ష హాల్లో అందజేయాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీలకు కనీస అర్హత మార్కులు లేనందున ఎంసెట్‌లో వారి అర్హతను, ఇంటర్మీడియట్ మార్కుల వెయిటేజీని నిర్ధారించేందుకు కుల ధ్రువీకరణ పత్రాన్ని కచ్చితంగా పరీక్ష కేంద్రంలో అందజేయాలని సూచించారు. నేటి నుంచి పీసెట్ ప్రవేశ పరీక్షలు గుంటూరు, న్యూస్‌లైన్: రాష్ట్ర వ్యాప్తంగా బీపీఈడీ, యూజీడీపీఈడీ కోర్సుల్లో 2014-15 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి నిర్వహించే పీసెట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) బుధవారం నుంచి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ఏఎన్‌యూ)లో జరుగుతుందని కన్వీనర్ ఆచార్య వై.కిషోర్ తెలిపారు. పురుషుల విభాగంలో బుధవారం నుంచి జూన్ 13 వరకు, మహిళల విభాగంలో జూన్14 నుంచి జూన్18వ తేదీ వరకు జరుగుతాయని చెప్పారు. పురుషుల విభాగంలో 20,545 మంది, మహిళల విభాగంలో4,068 మంది చొప్పున మొత్తం 24,631 మంది దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. తొలిరోజు హాల్‌టికెట్ నంబర్ 10001 నుంచి 10604 వరకు అభ్యర్థులకు ప్రవేశ పరీక్షలు జరుగుతాయన్నారు. నేడు పాలిసెట్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష(పాలిసెట్-2014)ను ఈనెల 21న నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని సాంకేతిక విద్య, శిక్షణ మండలి కార్యదర్శి వెంకటేశ్వర్లు వెల్లడించారు. పరీక్ష ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1.50లక్షల సీట్లు ఈ పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు. రాష్ట్రంలోని 68 ప్రాం తాల్లో 649 పరీక్షకేంద్రాలు ఏర్పాటుచేశారు. బాలికల కోసం ప్రత్యేకంగా 12 కేంద్రాలు ఉన్నాయి. మొత్తం 2,54,060 మంది విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష కీని ఈ నెల 28న, ఫలితాలను జూన్ 4న విడుదల చేస్తారు. కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్ ఈ నెలాఖరులోనే విడుదలవుతుంది. జూన్ రెండో వారంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఇంటర్లో ప్రవేశాలకు 26నుంచి దరఖాస్తులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, ఏపీ రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాలల్లో మొదటి దశ ప్రవేశాల కోసం ఈనెల 26 నుంచి ఆయా కాలేజీల్లో దరఖాస్తు ఫారాలు విక్రయించనున్నారు. ఇంటర్ బోర్డు కార్యదర్శి రామశంకర్ నాయక్ కథనం ప్రకారం.. పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 30వ తేదీలోగా కాలేజీల్లో అందజేయాలి. జూన్ 30వ తేదీతో మొదటి దశ ప్రవేశాలు పూర్తవుతాయి. తరగతులు జూన్ 4నుంచి ప్రారంభం అవుతాయి. పదోతరగతిలో విద్యార్థులు సాధించిన గ్రేడ్ పాయింట్ యావరేజ్ ప్రకారం ఎంపిక ఉం టుంది. ప్రతి సెక్షన్లో 88 మందికి మించకుండా ప్రవేశాలు చేపట్టాలని ఆదేశించారు. 26నుంచి ఓయూసెట్ హాల్‌టికెట్లు హైదరాబాద్, న్యూస్‌లైన్: ఓయూసెట్-2014 హాల్‌టికెట్లు ఈ నెల 26 నుంచి ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓయూసెట్‌కు రూ.250 అపరాధ రుసుముతో దరఖాస్తుల స్వీకరణ గడువు మంగళవారంతో ముగిసిందని, మొత్తం 64 వేలకు పైగా దరఖాస్తులు అందాయని పీజీ అడ్మిషన్స్ డెరైక్టర్ ప్రొ.శివరాజ్ తెలిపారు. సబ్జెక్టుల వారీగా చూస్తే 79 వేల మంది విద్యార్థులు వివిధ పీజీ కోర్సుల ప్రవేశ పరీక్షలకు హాజరు కానున్నట్లు చెప్పారు. ప్రవేశ పరీక్షలు జూన్ 4 లేదా 5 నుంచి ప్రారంభం కానున్నాయి. 26, 27 తేదీల్లో ఎండీఎస్ కౌన్సెలింగ్ విజయవాడ, న్యూస్‌లైన్: డెంటల్పోస్టు గ్రాడ్యుయేషన్ (ఎండీఎస్) కోర్సుల్లో 2014-15 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం ఈనెల 26, 27 తేదీల్లో విజయవాడలోని యూనివర్శిటీ ప్రాంగణంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎన్.బాబూలాల్ తెలిపారు. 30న సెకండ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థుల సర్టిఫికెట్లను ఈనెల 25న ఉదయం 11గంటలకు వర్సిటీలో మెడికల్ బోర్డు పరిశీలించనున్నట్లు తెలిపారు. పీజీ సీట్ల వివరాలు, ఇతర సమాచారాన్ని కౌన్సెలింగ్‌కు ఒక రోజు ముందు యూనివర్శిటీ వెబ్సైట్ జ్ట్టిఞ://్టటఠజిట.్చఞ.జీఛి.జీలో ఉంచుతామని ఆయన పేర్కొన్నారు. తెలుగు వర్సిటీ దూరవిద్య తరగతులు హైదరాబాద్, న్యూస్‌లైన్: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం దూరవిద్యా కేంద్రం విద్యార్థులకు బుధవారం నుంచి కాంటాక్టు తరగతులు ప్రారంభం అవుతున్నాయి. ప్రథమ సంవత్సరం ఎంఏ తెలుగు, సంస్కృతం, టూరిజం మేనేజ్మెంట్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచింగ్, జ్యోతిషం, ఎంసీజే, పీజీ డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు, బీఏ స్పెషల్ తెలుగు, బీఏ కర్ణాటక సంగీతం(మొదటి/నాల్గవ సంవత్సరం), సినిమా రచన డిప్లొమా కోర్సు విద్యార్థులకు బుధవారం నుంచి 30వ తేదీ వరకు కాంటాక్టు తరగతులను హైదరాబాదులోని విశ్వవిద్యాలయ ప్రధాన ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య కె.ఆశీర్వాదం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే, సంగీత విశారద, లలిత సంగీతం, జ్యోతిషం సర్టిఫికెట్, జ్యోతిషం డిప్లొమా, పీజీ డిప్లొమా ఇన్ టెలివిజన్ జర్నలిజం కోర్సు విద్యార్థులకు 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కాంటాక్టు తరగతులు ఉంటాయని పేర్కొన్నారు. కాగా, విద్యార్థులు తమ వార్షిక పరీక్ష ఫీజును జూన్ 10లోగా చెల్లించాలని రిజిస్ట్రార్ ఆశీర్వాదం సూచించారు. -
నిమిషం లేటైనా... నో ఎంట్రీ
కన్వీనర్ ఎన్వీ రమణరావు రేపే ఎంసెట్-2014 ప్రవేశపరీక్ష నగరంలో 8 జోన్లు.. 148 పరీక్ష కేంద్రాలు గ్రేటర్ నుంచి 81,445 మంది అభ్యర్థులు మెడిసిన్‌కు అబ్బాయిల కన్నా అమ్మాయిలే అధికం సాక్షి, సిటీబ్యూరో: ‘ఇంజినీరింగ్, మెడికల్ అండ్ అగ్రికల్చర్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఎంసెట్)-2014 గురువారం జరగనుంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు ఇంజినీరింగ్ పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు మెడికల్ అండ్ అగ్రికల్చర్ పరీక్ష జరుగుతాయి. అభ్యర్థులను నిర్దేశిత సమయం కన్నా గంట ముందే పరీక్ష హాల్లోకి అనుమతిస్తాం. నిమిషం లేటుగా వచ్చినా అనుమతించం. పరీక్షలకు హాజరు కానున్న విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చే శాం. మాస్ కాపీయింగ్‌ను అరికట్టేందుకు కూడా పకడ్బందీ చర్యలు చేపట్టాం’ అని ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ రమణరావు పేర్కొన్నారు. నగరంలో ఎంసెట్ నిర్వహణ ఏర్పాట్ల గురించి మంగళవారం ఆయన విలేకరులకు వివరించారు. మరో 24గంటల్లో ఎంసెట్ పరీక్షకు హాజరుకాబోతున్న అభ్యర్థులకు పలు సూచనలు చేశారు. కన్వీనర్ ఏం చెప్పారంటే.. నగరంలో మెట్రోపనులు, ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు వారి నివాస ప్రాంతానికి 5 కిలోమీటర్ల రేడియస్‌లో పరీక్షా కేంద్రం ఉండేలా ఏర్పాట్లు చేశాం. పరీక్షా కేంద్రాల వద్ద రద్దీని నివారించేందుకు ఈసారి మెడికల్ పరీక్ష ఉన్న కేంద్రాల్లో ఇంజినీరింగ్ అభ్యర్థుల సంఖ్యను తగ్గించాం. గతంలో మాదిరిగానే ‘నిమిషం లేటు’ నిబంధన ఈసారి కూడా అమల్లో ఉంది. ఒక్క నిమిషం లేటైనా అనుమతించం. అభ్యర్థులు లేదా వారి తల్లిదండ్రులు పరీక్షాకేంద్రాన్ని ఒకరోజు ముందుగా చూసుకుంటే మేలు. చివరి నిమిషంలో పరీక్షాకేంద్రం ఎక్కడుందోనన్న హైరానా తప్పుతుంది. అలాగే ఒక అభ్యర్థి వెంట అధిక సంఖ్యలో కుటుంబ సభ్యులు వీలైనంత వరకు(ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా) రాకుండా ఉంటే మంచిది. అభ్యర్థులు తమ వెంట కేవలం బాల్‌పాయింట్ పెన్నులు, హాల్‌టికెట్, ఆన్లైన్ దరఖాస్తు ఫారం, ఎస్సీ, ఎస్టీ కేటగిరి వారైతే కుల ధ్రువీకరణ పత్రం తెచ్చుకుంటే చాలు. సెల్ఫోన్లు, గాగుల్స్, డిజిటల్ వాచీలు.. వగైరా గ్యాడ్జెట్లు నిషేధం. తెల్లకాగితం తెచ్చినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. ప్రత్యేక బస్సుల కోసం ఆర్టీసీ, నిరంతర విద్యుత్ సరఫరా కోసం ఆ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షాకేంద్రాల సమీపంలో ఉండే హోటళ్లు, దుకాణాలు, జిరాక్స్ సెంటర్లు, ఇంటర్నెట్ కేంద్రాలపై మఫ్టీలో ఉన్న పోలీసుల నిఘా ఉంటుంది. మాస్ కాపీయింగ్‌ను నిరోధించేందుకు పరీక్ష హాల్లోనూ ఇన్విజిలేటర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తారు. 24న ప్రాథమిక కీ ప్రకటిస్తాం. వారం రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరించి తుది కీని వెలువరిస్తాం. జూన్ 9న ఫలితాలు విడుదలకు అన్ని ఏర్పాట్లు చేశాం. దళారులను నమ్మొద్దు. ప్రలోభాలకు గురికావద్దు. మాయమాటలు చెబుతున్న వారి సమాచారాన్ని పోలీసులకు గానీ, ఎంసెట్ అధికారులకు గానీ తెల్పండి. ఎంసెట్ ప్రక్రియంతా పారదర్శకంగా ఉంటుంది. 81,445మంది అభ్యర్థులు ఎంసెట్-2014కి నగరం నుంచి 81,445మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే హైదరాబాద్ నుంచే అత్యధికంగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇంజినీరింగ్ పరీక్షకు 58242మంది అభ్యర్థులు ఉండగా, మెడికల్ అండ్ అగ్రికల్చర్ పరీక్షకు 23203మంది అభ్యర్థులున్నారు. ఇంజినీరింగ్‌కు దరఖాస్తు చేసుకున్న వారిలో అబ్బాయిలు 37,644మంది ఉండగా, అమ్మాయిలు 20,598మంది ఉన్నారు. మెడికల్ అండ్ అగ్రికల్చర్‌కు మాత్రం అబ్బాయి కంటే అమ్మాయిలే అధికంగా దరఖాస్తు చేసుకోవడం విశేషం. మెడికల్ అండ్ అగ్రికల్చర్ పరీక్ష 7197మంది అబ్బాయిలు రాస్తుండగా, రెట్టింపు సంఖ్యలో 16006 మంది అమ్మాయిలు రాస్తున్నారు. నగరంలో ఇంజినీరింగ్ పరీక్షకు 100 కేంద్రాలు, మెడికల్ పరీక్షకు ఏకంగా 48 కేంద్రాలను ఏర్పాటు చేశారు. -
ప్రకృతి రంగస్థలంపై టెంపెస్ట్ నాటకం