మే 14న తెలంగాణలో ఎంసెట్ పరీక్ష.. 24న ఫలితాలు | Eamcet exam to be held on May 14th, and May 24th Eamcet results will be released | Sakshi
Sakshi News home page

మే 14న తెలంగాణలో ఎంసెట్ పరీక్ష.. 24న ఫలితాలు

Published Sun, May 3 2015 6:56 PM | Last Updated on Sun, Sep 3 2017 1:21 AM

మే 14న తెలంగాణలో ఎంసెట్ పరీక్ష.. 24న ఫలితాలు

మే 14న తెలంగాణలో ఎంసెట్ పరీక్ష.. 24న ఫలితాలు

హైదరాబాద్: తెలంగాణలో మే 14న ఎంసెట్ పరీక్షను నిర్వహించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ రమణారావు పేర్కొన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 18న ఎంసెట్ కీ, 24న ఎంసెట్ ఫలితాలు విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు. అయితే ఎంసెట్ పరీక్షల నిర్వహణలో భాగంగా ఇంజినీరింగ్ పరీక్షకు 251 సెంటర్లు, మెడికల్ అండ్ అగ్రికల్చరల్ 172 సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. హైదరాబాద్ను 8 జోన్లుగా విభజించి విద్యార్థులను సమీప ప్రాంతంలోనే ఎంసెట్ పరీక్ష సెంటర్లు ఏర్పాట్లు చేస్తున్నామని రమణారావు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement