
మాధవ్ కోదాడ, శాషా చైత్రీ, మిమో చక్రవర్తి, రమణారావు బసవరాజు
ప్రముఖ హిందీ నటుడు మిథున్ చక్రవర్తి కుమారుడు మిమో చక్రవర్తి తెలుగు పరిశ్రమకు హీరోగా పరిచయం కాబోతు న్నారు. భోషో సమర్పణలో శ్రీ కళా చిత్ర బ్యానర్‌పై మాధవ్ కోదాడ దర్శకత్వంలో రమణారావు బసవ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘ఎయిర్‌టెల్ మోడల్’ ఫేమ్ శాషా చైత్రీ కథానాయికగా నటిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఓ పబ్ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. ‘‘తెలుగు పరిశ్రమకు హీరోగా పరిచయం కావడం గౌరవంగా భావిస్తున్నాను. ఈ సినిమా స్క్రిప్ట్ ఆసక్తికరంగా ఉంది’’ అన్నారు మిమో చక్రవర్తి.
‘‘మహేశ్ మంజ్రేకర్, మురళీ శర్మ, బ్రహ్మానందం, అభిమన్యుసింగ్, షిండే, రవి కాలే... ఇలా సినిమాలో భారీ తారాగణం ఉంది. ప్రస్తుతం ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీలో పార్టీ నేపథ్యంలోని పాటను చిత్రీకరిస్తున్నాం’’ అన్నారు మాధవ్ కోదాడ. ‘‘మల్టీ మీడియాలో గోల్డ్ మెడల్ పొందిన వ్యక్తి మాధవ్. తన ఆలోచనలు కొత్తగా ఉంటాయి. ఇప్పటి వరకు 95 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఇంకా ఓ పాట, ఓ ఫైట్ చిత్రీకరిస్తే సినిమా పూర్తవుతుంది. వచ్చే నెలలో ఫస్ట్ లుక్, టైటిల్‌ను ప్రకటిస్తాం. ఏప్రిల్‌లో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు రమణారావు బసవరాజు. ఈ చిత్రానికి సహనిర్మాత: మారుతీ శ్యాం ప్రసాద్‌రెడ్డి, సంగీతం: శేఖర్ చంద్ర.
Comments
Please login to add a commentAdd a comment