
సోమవారం ఉదయం ఆయన భౌతిక కాయాన్ని ఫిలిం ఛాంబర్‌కు తరలిస్తారు. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అభిమానులు, ప్రజల సందర్శనార్థం
'ఒకటో నెంబర్ కుర్రాడు'తో వెండితెరపై అడుగుపెట్టి పలు సినిమాలు చేసిన టాలీవుడ్ నటుడు నందమూరి తారకరత్న శనివారం రాత్రి కన్నుమూశారు. ఆయన భౌతిక కాయాన్ని రంగారెడ్డి జిల్లా మోకిల గ్రామంలో తన నివాసానికి తరలించనున్నారు. సోమవారం ఉదయం ఆయన భౌతిక కాయాన్ని ఫిలిం ఛాంబర్‌కు తరలిస్తారు. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అభిమానులు, ప్రజల సందర్శనార్థం అక్కడే ఉంచుతారు. అనంతరం సాయంత్రం ఐదు గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరపనున్నారు.
కాగా గత నెల 27న నారా లోకేశ్ ప్రారంభించిన యువగళం పాదయాత్రలో తారకరత్న గుండెపోటుతో కుప్పకూలారు. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి ప్రాథమిక వైద్యం అందించారు. మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలకు తరలించారు. అక్కడ 23 రోజులపాటు మృత్యువుతో పోరాడిన ఆయన చివరకు తుదిశ్వాస విడిచారు.