
తాత సూపర్ స్టార్ కృష్ణ మృతిపట్ల మహేశ్ బాబు కూతురు సితార ఘట్టమనేని భావోద్వేగానికి లోనయ్యింది. ఈ మేరకు ఆమె సోషల్ మీడియో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. తాత కృష్ణతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేస్తూ ఇకపై ఇంతకు ముందలా ఉండదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ‘ఇకపై వీకెండ్ లంచ్ ఇంతకు ముందులా ఉండదు. మీరు నాకు ఎన్నో విలువైన విషయాలు నెర్పించారు.
చదవండి: సూపర్ స్టార్ కృష్ణ గురించి అప్పట్లో మహాకవి శ్రీశ్రీ ఏమన్నారో తెలుసా?
ఎప్పుడూ నన్ను నవ్వించేవారు. ఇప్పుటి నుంచి అవన్ని మీ జ్ఞాపకాలుగా నా మెమరిలో ఉండిపోతాయి. మీరు నా హీరో. ఏదో ఒక రోజు మీరు గర్వపడే స్థాయికి చేరుకుంటాను. మిస్ యూ సో మచ్ తాతగారు(తాతయ్య)’ అంటూ సితార రాసుకొచ్చింది. కాగా ఆదివారం రాత్రి గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన కృష్ణ చికిత్స పొందతూ నిన్న మంగళవారం తెల్లవారుజాము తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో ఘట్టమనేని కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
చదవండి: ఈ నాలుగు కోరికలు తీరకుండానే కన్నుమూసిన సూపర్ స్టార్
Comments
Please login to add a commentAdd a comment