![అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం](/styles/webp/s3/article_images/2017/09/2/81396947686_625x300.jpg.webp?itok=3f8A8ZEA)
అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం
భద్రాచలం : సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. భద్రాద్రి కళ్యాణ శోభతో కళకళలాడింది. ఆకాశమంత పందిరి ... భూదేవంత పీట ...పచ్చని తోరణాలు స్వాగతం పలుకుతుండగా.. మంగళవాయిద్యాల నడుమ పల్లకిలో శ్రీరామ చంద్రుడ్ని కల్యాణమండపానికి తరలించారు.
మండపానికి చేరుకున్న సీతమ్మ తల్లిని దర్శించుకుని భక్తులు పారవశ్యంలో మునిగిపోయారు. విష్ణు స్వరూపుడైన శ్రీరామునికి ..శ్రీమహాలక్ష్మి ప్రతిరూపమైన సీతమ్మనిచ్చి కన్యాదానం నిర్వహించారు. వేద మంత్రాల మధ్య శ్రీరాముడు సీతమ్మకు మంగళ సూత్రధారణ చేశాడు.. రాముని కళ్యాణానికి గవర్నర్ నరసింహన్ ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు.