sitaramula kalyanam
-
శ్రీ సీతారాముల కల్యాణోత్సవంలో పాల్గొన్న అవినాష్ రెడ్డి
-
నేత్రపర్వం.. సీతారాముల కల్యాణం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/సిరిసిల్ల: భద్రాచలంలో సీతారాముల కల్యాణం బుధవారం వైభవంగా జరిగింది. ఉదయం 8 గంటలకు ఆలయ గర్భగుడిలో ఉన్న మూలవిరాట్లకు వేదపండితులు లఘు కల్యాణం నిర్వహించి లక్ష్మణ సమేత సీతారాముల ఉత్సవ విగ్రహాలను ఆలయం నుంచి పల్లకీలో వెలుపలకు తీసుకువచ్చారు. కల్యాణ మండపంలో శ్రీరాముడిని సింహాసనంలో, ఆయనకు ఎదురుగా గజాసనంపై సీతమ్మవారిని కొలువుదీర్చారు. మధ్యాహ్నం 12 గంటలకు అర్చకులు సీతారాముల ఉత్సవమూర్తుల శిరస్సులపై జీలకర్ర, బెల్లం పెట్టారు. అనంతరం సీతమ్మ వారికి మాంగల్యధారణ చేసి వెండి పాత్రల్లో ఉంచిన ముత్యాల తలంబ్రాలను సీతారాములపై పోశారు. ఆ తర్వాత తలంబ్రాలతో వేడుక నిర్వహించారు. స్వామివారికి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పట్టువ్రస్తాలు, ముత్యాల తలంబ్రాలను, త్రిదండి చినజీయర్ స్వామి మఠం, శృంగేరి పీఠం, శ్రీరంగం, టీటీడీ తరఫున ప్రతినిధులు వ్రస్తాలను సమర్పించారు. ఈ వేడుకకు సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ నరసింహ, తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ భీమపాక నగేశ్, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్.హæరినాథ్, జస్టిస్ రవినాథ్ తిల్హారి హాజరయ్యారు. గురువారం మిథిలా స్టేడియంలో పట్టాభిõÙక మహోత్సవం జరగనుంది. కల్యాణోత్సవానికి తాను నేసిన బంగారు, వెండి జరీ పోగుల చీరను సిరిసిల్ల నేత కళాకారుడు హరిప్రసాద్ కానుకగా అందించారు. ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం శాస్త్రోక్తం గా ధ్వజారోహణం 22న కల్యాణోత్సవానికి విస్తృత ఏర్పాట్లు ఒంటిమిట్ట: వైఎస్సార్‌జిల్లా ఒంటిమిట్టలోని శ్రీకోదండరామస్వామి ఆలయంలో బుధవారం ఉదయం 10.30 నుంచి 11 గంటల మధ్య ధ్వజారోహణంతో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. కంకణబట్టర్ రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో ముందుగా గరుడ ధ్వజపటాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి గరుడ ప్రతిష్ట, ప్రాణప్రతిష్ట, నేత్రోల్మలనం నిర్వహించారు. ధ్వజస్తంభానికి నవకలశ పంచామృతాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వేదపండితులు చతుర్వేద పారాయణం చేశారు. ఉత్సవాల్లో ప్రధానంగా ఈ నెల 20న హనుమంత వాహనం, 22న కల్యాణోత్సవం, 23న రథోత్సవం, 25న చక్రస్నానం నిర్వహించనున్నారు. 22న సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు శ్రీసీతారాముల కల్యాణం కన్నుల పండువగా జరుగనుంది. ఈ వేడుక చూసేందుకు భారీగా భక్తులు తరలిరానున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి సీతారామ లక్ష్మణులు ఒంటిమిట్ట పురవీధుల్లో శేషవాహనంపై విహరించారు. -
రామయ్య తలంబ్రాలు గంటకు 1,500 ప్యాకెట్లు
భద్రాచలం: భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాలు సిద్ధమవుతున్నాయి. భద్రాచలంలో కల్యాణోత్సవానికి హాజరయ్యే భక్తులకు పంచడంతోపాటు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకునేవారికి సరఫరా చేసేందుకు దేవస్థా నం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కువ మంది భక్తులకు తలంబ్రాలు అందించేందుకు వీలుగా ప్రత్యే క యంత్రాల ద్వారా వాటిని ప్యాకింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ తలంబ్రాల తయారీ ప్రక్రియ వేగం పుంజుకుంది. రామయ్య కల్యాణ తలంబ్రాలు కావాల నుకునేవారు మీసేవ కేంద్రాల ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఇన్నాళ్ల ఇబ్బందికి చెక్.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఏటా శ్రీసీతా రాముల కల్యాణ మహోత్స వాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సీతారాములకు సమర్పించే ముత్యా ల తలంబ్రాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ఆ ముత్యాల తలంబ్రాలను ఇంటికి తీసుకెళితే మంచి జరు గుతుందన్న భావనతో చాలా మంది భక్తులు తీసుకుంటుంటారు. శ్రీరామనవమి రోజున భద్రాచలం వచ్చిన భక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో ఉచితంగానే ముత్యాల తలంబ్రాలను అందిస్తారు. దూర ప్రాంతాల్లో ఉండి కల్యాణోత్సవానికి హాజరు కాలేని వారితోపాటు బంధువులు, స్నేహితులకు అందజేసేందుకు కావాలను కునే భక్తుల కోసం దేవస్థానం రెండు ముత్యాలతో కూడిన తలంబ్రాలను విక్రయిస్తోంది. గతంలో ఈ తలంబ్రాలను స్వచ్ఛంద సంస్థ సభ్యులతో ప్యాకింగ్ చేయించేవారు. దీనితో చాలా సమయం పట్టడంతోపాటు ఆ ప్యాకెట్లు రవాణాలో చిరిగిపోయేవి. ఈ క్రమంలోనే వేగంగా ప్యాకింగ్ చేయడం, రవాణాలో దెబ్బతినకుండా ఉండేలా దేవస్థానం అధికారులు ప్యాకింగ్ యంత్రాలపై దృష్టిపెట్టారు. దాతల చేయూతతో యంత్రాలు.. ముత్యాల తలంబ్రాలు, పులిహోర ప్రసా దం ప్యాకింగ్ యంత్రాల కోసం దేవస్థానం అధికారులు దాతలను సంప్రదించారు. తిరుపతి ఖాదీబండార్కు చెందిన కుమార్ కిట్టు యాజమాన్యం రూ.1.40 లక్షలతో తలంబ్రాల ప్యాకింగ్ యంత్రాన్ని, శశి విద్యాసంస్థల యాజమాన్యం రూ.1.50 లక్షల విలువైన ప్యాకింగ్ కవర్లను సమకూ ర్చాయి. ఇక రూ.1.45 లక్షల విలువైన పులిహోర ప్రసాదం ప్యాకింగ్ యంత్రాన్ని తులసి ఆస్పత్రి యజమాన్యం ఏజేఆర్ సేవా సంస్థ పేరుతో సమకూర్చింది. గంటకు 1,500 ప్యాకెట్లు యంత్రంలో తలంబ్రాల నడుమ ముత్యాలు ఉంచి ఆన్ చేస్తే ఆటోమేటిక్‌గా ప్యాకెట్లు తయారై బయటికి వస్తాయి. ఈ యంత్రం ద్వారా నిమిషానికి 25 చొప్పున గంటకు 1,500 ప్యాకెట్లు సిద్ధమవుతున్నాయి. రోజూ సుమారు 20 వేల వరకు ప్యాకెట్లు చేస్తున్నారు. ఈ ఏడాది సుమారు 2 లక్షల తలంబ్రాల ప్యాకెట్లను భక్తులకు అందుబాటులో ఉంచాలని అధికారులు నిర్ణయించారు. పులిహోర ప్యాకింగ్ యంత్రం ద్వారా గంటకు 1,400 వరకు ప్యాకెట్లు సిద్ధ మవుతున్నాయి. ఇటీవలి వరకు రోజువారీగా విక్ర యించే ప్రసాదాన్ని ప్యాక్ చేయాలంటే కార్మికులకు ఒకపూటంతా పట్టేదని.. ఇప్పుడు 2 గంటల్లోనే పని పూ ర్తవుతోందని అధికారులు చెప్పారు. పోస్టల్ శాఖ, ఆర్టీసీ కార్గో ద్వారా తలంబ్రాలను భక్తులకు చేరవేస్తున్నామని పేర్కొన్నారు. -
సీతారాముల కల్యాణం.. పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్
ఒంటిమిట్ట: వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలోని శ్రీకోదండరామాలయంలో శుక్రవారం రాత్రి సీతారాముల కల్యాణం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సీతారాములకు ప్రభుత్వం తరఫున సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పిస్తారు. రెండేళ్లుగా కరోనా ఆంక్షలతో సీతారాముల కల్యాణాన్ని ప్రత్యక్షంగా తిలకించే భాగ్యానికి భక్తజనం నోచుకోలేదు. ఈసారి లక్షలాదిమంది భక్తుల సమక్షంలో భారీ ఎత్తున కల్యాణోత్సవం నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. శుక్రవారం రాత్రి 8 నుంచి 10 గంటల వరకు జరగనున్న జగనానందకారకుడి జగత్కల్యాణానికి మిథిలా మండపం ముస్తాబైంది. గరుడవాహనంపై శ్రీరామచంద్రుడు వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదోరోజు గురువారం ఉదయం మోహినీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన కోదండరాముడు రాత్రి 8 నుంచి 9:30 గంటల వరకు గరుడ వాహనంపై భక్తులను అనుగ్రహించారు. ఉదయం స్నపన తిరుమంజనం, సాయంత్రం ఊంజల్‌సేవ వైభవంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం కోదండరాముడు శివధనుర్భంగాలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తారు. -
అందరి బంధువయా రామయ్యా
శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల వేళలో విష్ణుమూర్తి ఏడవ అవతారంగా త్రేతాయుగంలో జన్మించాడు. యుగాలు గడిచినా ఆ మహనీయుని పుట్టినరోజును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పద్నాలుగేళ్లు అరణ్యవాసం, రావణ సంహారం తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగిందంటారు. శ్రీ సీతారాముల కల్యాణం కూడా ఈ రోజునే జరిగింది. అందుకు గుర్తుగా ఈనాడు దేశమంతటా సీతారామ కల్యాణాన్ని తమ ఇంటిలో పెళ్లేనేమో అన్నంత శ్రద్ధాభక్తులతో సంబరంగా జరుపుకుంటారు. అయితే మానవుడిగా పుట్టిన రాముడు దేవుడిగా ఇన్ని కోట్ల గుండెల్లో కొలువై ఉండటానికి కారణం క్లిష్ట పరిస్థితులలోనూ ఆయన అనుసరించిన ధర్మమే. ఈ శ్రీరామ నవమి పర్వదినాన మనం రాముడి ధర్మనిరతిని గురించి తలచుకుందాం. రామ రసాంబుధిలో ఓలలాడదాం. రాముడు మన నిత్యజీవితంలో మమేకమైన వాడు. తెల్లవారి లేస్తే రామ శబ్దం వినకుండా ఉండలేము. శ్రీరామ అని లేకుండా శుభలేఖ లేదు. శ్రీరామ అని రాయకుండా ఇదివరకటి రోజుల్లో ఉత్తరం రాసేవాళ్లు కాదు. ఇద్దరి మధ్య సఖ్యత చెడితే, నీకు నాకు రామ్ – రామ్ అంటారు. నచ్చని విషయం చెబితే ‘రామ రామ’ అంటారు. రాముడు మంచి బాలుడు అంటారు. రామబంటు అంటారు, ఆకలి వేస్తే ఆత్మారాముడు అల్లరి చేస్తున్నాడంటారు. ఈ విధంగా అందరి జీవనంతో విడదీయరానిదిగా మారిపోయింది రామ శబ్దం. రాముణ్ణి ఎందుకు తలచుకుంటున్నామంటే... ఆయన జీవితం చాలా వరకు సమస్యలతోనే కూడుకుంది. అయితే ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా, ఎన్ని విధాలైన కష్టాలు వచ్చినా ఒక్కసారి కూడా ధర్మాన్ని తప్పలేదు. శరణన్న శత్రువును కూడా క్షమించి వదిలిపెట్టిన ఉదార మనస్తత్వం ఆయనది. ఆయన ధర్మాన్ని అనుసరించడం కాదు... ఆయన అనుసరించిన మార్గమే ధర్మంగా మారింది. అదే మానవుడిగా పుట్టిన వాడిని మహనీయుణ్ణి చేసింది. చివరికి దేవుణ్ణి చేసింది. అందుకే ఆయన అనుసరించిన మార్గం రామాయణ మహాకావ్యంగా రూపు దిద్దుకుంది. తరతరాలుగా పఠనీయ కావ్యంగా.. పారాయణ గ్రంథంగా మారిపోయింది. మూర్తీభవించిన ధర్మస్వరూపం శ్రీరాముడు ధర్మజ్ఞుడు. తల్లిదండ్రులు, గురువులు, సోదరులు, సహధర్మచారిణి, సేవకులు, స్నేహితులు, సన్నిహితులు, ప్రజలు, రుషులు, రాక్షసులు, పశుపక్ష్యాదులు... ఇలా ఎవరితో ఏ విధమైన ధర్మాన్ని అనుసరించాలో అన్ని ధర్మాలు తెలిసిన వాడు, ఆచరించినవాడు. అందుకే మారీచుడి వంటి రాక్షసుడు కూడా రావణునితో ‘రాముడంటే ఎవరనుకున్నావ్, సాక్షాత్తూ నడిచొచ్చే ధర్మస్వరూపమే’అని అన్నాడంటే ఆయన గొప్పతనాన్ని అర్థం చేసుకోవచ్చు. తార చెప్పింది రాముడు ధర్మజ్ఞుడని. రాముడు ఎన్నడూ ధర్మాన్ని అతిక్రమించలేదు. ధర్మాన్ని విడువ లేదు అందాల రాముడు పురుషులను కూడా మోహింప చేసేంతటి అందమైన రూపం శ్రీరాముడిది. మునులు రాముణ్ణి ఎంతగానో ఆరాధించారు. అభిమానించారు. ప్రేమించారు. రాముణ్ణి చూడకుండా హనుమ క్షణం కూడా ఉండలేకపోయేవాడట. ముక్కు, చెవులు కోయించుకున్న శూర్పణఖ, అన్నగారైన రావణుడి దగ్గరకి వెళ్లి శ్రీరాముని సౌందర్యాన్ని వర్ణిస్తుంది. అదేపనిగా పొగుడుతుంది. సౌశీల్యవంతుడు ఎదుటివారిని ముందుగా తానే చిరునవ్వుతో పలకరించే సౌశీల్యం రామునిది. పడవ నడిపే గుహుడు, రామునికి ప్రాణమిత్రుడు. కేవలం నిషాద రాజ్యానికి రాజు అయిన గుహుడు ఎక్కడ? చక్రవర్తి అయిన రాముడెక్కడ? అదేవిధంగా సుగ్రీవుణ్ణి ఆదరించాడు. విభీషణుడికి ఆశ్రయం ఇచ్చాడు. రాజనీతిజ్ఞుడు రాజనీతిలోనూ, వ్యూహ రచనలోనూ రామునికి మించిన వారులేరని పేరు. ప్రజలకు ఏమి కావాలో రాముడికి తెలిసినంతగా వేరెవరికీ తెలియదేమో అన్నంతగా ఆయన కాలంలో ధర్మం నాలుగు పాదాలా నడిచింది. అందుకే ఇప్పటికీ రామరాజ్యాన్ని, రాముడి పాలననీ తలచుకుంటారు. శ్రీరామ నవమి నాడు ఆచరించ వలసినవి... రామనవమి పర్వదినాన ప్రతి ఒక్కరినీ కొన్ని పనులు చేయమంటుంది శాస్త్రం. 1 . సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి తల స్నానం చేసి, ఇంట్లో సీతారాముల వారిని భక్తి, శ్రద్ధలతో పూజించాలి. 2. వడపప్పు, పానకం, పాయసంలాంటి పదార్థాలతో రాముడికి నివేదన చేసి అందరికీ పంచి పెట్టాలి. 3. రోజంతా శ్రీరామ నామం స్మరిస్తూ ఉండటం. 4. శక్తి కొలదీ దానధర్మాలు చేయాలి. ఎందుకంటే రామనవమి తిథి లాంటి మహా పర్వదినం నాడు చేసే ఏ పుణ్యకర్మయినా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. 5. రామనవమి నాడు పగలు ఉపవాసం, రాత్రికి జాగరణ చెయ్యమంటారు పెద్దలు. కాబట్టి ఆరోగ్యం సహకరించినంత వరకు పాలు, పండ్లు లాంటి సాత్వికమైన ఆహారం తీసుకుని రామనామాన్ని స్మరిస్తూ, వీలయితే రాత్రికి జాగరణ చెయ్యడం మంచిది. 6. దగ్గర్లోని రామాలయానికి వెళ్లి, భగవద్దర్శనం చేసుకోవాలి. అవకాశం ఉంటే సీతారాములవారి కల్యాణోత్సవాన్ని కన్నులారా వీక్షించడం.. లేదా టీవీలలో చూపించే ప్రత్యక్ష ప్రసారాలను అయినా భక్తి భావంతో చూడాలి. 7. వీలయితే రామాయణ పారాయణం లేదా శ్రవణం చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. అందరూ భక్తిశ్రద్ధలతో రామనవమి ఉత్సవాన్ని జరుపుకోవాలని, రామచంద్ర ప్రభువు చల్లని చూపులు మనందరి మీదా ప్రసరించాలని కోరుకుందాం. శ్రీ రామ జయ రామ జయ జయ రామ! విష్ణు సహస్ర నామంతో సమానం కైలాసంలో ఒక రోజు పార్వతీదేవి పరమశివుడిని విష్ణు సహస్రనామ స్తోత్రానికి కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరింది. దానికి ఈశ్వరుడు ‘ఓ పార్వతీ! నేను నిరంతరం ఆ ఫలితం కోసం జపించేది ఇదే సుమా!’ అని చెప్పి ఈ శ్లోకంతో మంత్రోపదేశం చేశాడు . శ్లో : శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే ! సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే !! ఈ శ్లోకం మూడుసార్లు స్మరించినంత మాత్రానే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమే కాదు. భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. ‘రామ’ అంటే రమించడం అని అర్థం కాబట్టి మనం ఎప్పుడూ హృదయాలలో శ్రీరాముని స్మరిస్తూ ఉండాలి. ‘రా’ అనే అక్షరం పలకగానే నోరు తెరుచుకుని మనలోపల ఉన్న పాపాలు అన్నీ బయటకు వచ్చి రామనామ అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయట. ‘మ’ అనే అక్షరం ఉచ్చరించినప్పుడు నోరు మూసుకుంటుంది కాబట్టి బయట మనకు కనిపించే ఆ పాపాలు ఏవీ మానవుల శరీరాలలోకి ప్రవేశించలేవు. భద్రగిరి రామయ్య భద్రోభద్రయా అంటూ వేదం ఉపదేశించిన సుభద్రకరమైన భద్రబీజాక్షరాలకు సాకారం– భద్రాచల రాముడు. త్రేతాయుగంలో రాముడు తన అవతార లక్ష్యాన్ని జయప్రదంగా నిర్వహించాడు. ద్వాపరయుగం తరవాత, ఈ కలియుగాన భద్రుడనే భక్తుడి కోసం భద్రకరమూర్తిగా వైకుంఠం నుంచి తరలి వచ్చి భద్రాద్రి రాముడిగా భద్రగిరిపై కొలువయ్యాడు. భవబంధాల్ని సునాయాసంగా అధిగమించడానికి భద్రాచల రాముణ్ని సేవించాలని బ్రహ్మాండ పురాణోక్తి. శ్రీరాముడు నెలకొన్న భద్రగిరి– తెలుగువారి అయోధ్యాపురి. శ్రీరాముడు అరణ్యవాసంలో ఉన్నప్పుడు తనను సేదతీర్చిన, శిలారూపంలో ఉన్న భద్రుణ్ని అనుగ్రహించాడంటారు. వసంత నవరాత్రి ప్రయుక్తంగా భద్రాచల శ్రీసీతారామ చంద్రస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రానందకరంగా జరుగుతాయి. వసంత రుతుశోభకు నవ్యసౌకుమార్యాన్ని ఆపాదించే సీతారామ కల్యాణోత్సవం నవనవోన్మేషం... మధురాతి మధురం. ‘సీతమ్మ మా అమ్మ, శ్రీరాముడు మాకు తండ్రి’ అనే ప్రేమాస్పద అనుభూతితో భక్తుల హృదయం ఉప్పొంగుతుంది. కంచర్ల గోపన్న భక్తరామదాసుగా శ్రీరామసేవా దీక్షను స్వీకరించాడు. ప్రతి సంవత్సరం శ్రీరామ జన్మదినోత్సవమైన శ్రీరామనవమి నాడు శ్రీసీతారాములకు తిరుకల్యాణ మహోత్సవాన్ని జరిపించే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టాడు. సిరికల్యాణ తిలకంతో, మణిమయ బాసికాలతో ఆణిముత్యాలే తలంబ్రాలుగా జాలువారే ముగ్ధమోహనమైన, మనోరంజకమైన సీతారాముల పెళ్ళి వేడుక జగదానందకారకమై భాసిస్తుంది. శ్రీరామనవమి మరుసటి రోజు దశమినాడు శ్రీరామ పట్టాభిషేకాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ధర్మానికి నిలువెత్తు రూపమైన రాముడు చూపిన మార్గంలో పయనిస్తామని, ధర్మనిర్వహణలో సదా మమేకమవుతామని భక్తులు ప్రతినబూనడమే శ్రీరామ పట్టాభిషేక వేడుకలోని అంతరార్థం. రామాయణంలో ఏముంది? రామాయణం ఓ విలువల ఆయనం.. విలువైన కావ్యం. వేదతుల్యమైన రామాయణం సామాజిక అభ్యున్నతికి ఉపకరించే సూత్రాల్ని నిర్దేశించింది. సత్యం, ధర్మం అనే రెండు చక్రాల జీవనరథంలో ఎలా ముందుకు పయనించాలో రామాయణం చాటిచెప్పింది. ఏడు కాండలు, ఐదువందల అధ్యాయాలు, ఇరవైనాలుగువేల పద్యాల మహాకావ్యం. అధ్యాయాన్ని ‘సర్గ’ అంటారు. పద్యాన్ని ‘శ్లోకం’ అంటారు. పేరుకు మాత్రమే రామకథ కానీ.. అందులో రకరకాల పాత్రలు కనిపిస్తాయి. నదులూ, పర్వతాలూ, అడువులూ, వివిధ దేశాలూ, అనేకానేక లోకాలూ కథాక్రమంలో ప్రస్తావనకు వచ్చాయి. భిన్న జాతుల మనుషుల్నీ, వృక్షాల్నీ, పశుపక్ష్యాదుల్ని పరిచయం చేశాడు వాల్మీకి. ఎంతోమంది రాజులు తారసపడతారు. వారి వంశాలూ తెలుస్తాయి. విజ్ఞాన సర్వస్వం రామాయణంలో భూగోళం ఉంది, జీవ–జంతుశాస్త్రాలు ఉన్నాయి. ఇక మంచిచెడుల విషయానికొస్తే ఇది అచ్చమైన విలువల వాచకం. యుద్ధ వ్యూహాలూ, రణ తంత్రాలూ ఉన్నాయి. వాటిని నేటి రాజకీయాలకు అన్వయించుకుని రాజనీతి శాస్త్రానికో, ప్రజాపరిపాలన శాస్త్రానికో అనుబంధంగా చేర్చుకోవచ్చు. సీతాన్వేషణలో భాగంగా వాల్మీకి విశ్వాన్ని కూడా వర్ణించాడు కాబట్టి, అంతరిక్ష శాస్త్రంగానూ పరిగణించుకోవచ్చు. మొత్తంగా రామాయణం సమగ్ర విజ్ఞాన సర్వస్వం! సకల శాస్త్రాల సారం వాల్మీకి మహర్షి రామాయణాన్ని శ్రీరామపట్టాభిషేకానికో, రావణ సంహారానికో పరిమితం చేయలేదు. సకల వేదాల సారాన్నీ, ఉపనిషత్తుల రహస్యాల్నీ ఒడుపు గా ఇమిడ్చాడు. వ్యక్తిధర్మం, రాజధర్మం, పుత్రధర్మం... అన్నింటికీ మించి మానవ ధర్మం – రామకథలో అంతర్లీనం. అద్భుతమైన భావ వ్యక్తీకరణలు! రాముడు అరణ్యవాసానికి వెళ్లిపోగానే దశరథుడు దుఃఖంలో మునిగిపోతాడు. అనారోగ్యం కబళిస్తుంది. చూపు మందగిస్తుంది. ఆ విషాదకర సన్నివేశంలో కౌసల్యతో ఓ మాట అంటాడు ‘రాముడు నా కనుపాప. తనతోపాటు నా చూపూ వెళ్లిపోయింది’. హనుమంతుడు అశోక వృక్షం మీద వాలే సమయానికి సీతాదేవి ‘వక్కలైన విశ్వాసంలా ఉంది’ అంటాడు వాల్మీకి. ఎంత గొప్ప వ్యక్తీకరణ? ఆ వర్ణనలూ అంతే. రావణుడు అపహరించే సమయానికి పసుపు పచ్చని చీరలో ఉంది సీతాదేవి. ఆకాశంలో పుష్పక విమానం ఎగిరిపోతుంటే.. ఆ గాలికి చీర కొంగు రెపరెపలాడుతున్నది. పక్కనే నల్లగా అంతెత్తున రావణుడు. ఆ దృశ్యం ఏదో పర్వతం మీద మంటలు అంటుకున్నట్టుగా ఉందట. ఎంత గొప్ప వర్ణన! తెలుగులో గొప్ప రచనలు చేయాలనుకునేవారు రామాయణం చదివితే చాలు... అద్భుతమైన వాక్యాలు... అంతకన్నా అద్భుతమైన వర్ణనలు దొరుకుతాయి. కలం ముందుకెళుతుంది. – డి.వి.ఆర్. భాస్కర్ -
సింగపూర్‌లో సీతారాముల కళ్యాణం
సింగపూర్ : సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1న స్థానిక శ్రీ శ్రీనివాస పెరుమాళ్ దేవాలయ సమీపంలోని పీజీపీ హాల్లో శ్రీ సీతారాముల కళ్యాణం అట్టహాసంగా జరుగనుంది. ఈ కార్యక్రమం కోసం భద్రాచలం నుంచి అర్చక బృందం రానున్నారు. సీతారామ కళ్యాణం లోక జీవన హేతుకం, సకల దోష నివారణం అని పండితులు అంటున్నారు. రాముడు జన్మించిన సంవత్సరం విలంబ అని, మరలా అరవై సంవత్సరాలకు గాని రాని విలంబ నామ సంవత్సరంలో కళ్యాణదర్శన ఫలం ద్విగుణీకృతం అవుతుందని పేర్కొన్నారు. శ్రీరామనవమి రోజున భద్రాద్రిలో ఏవిధంగా సీతారామ కళ్యాణం జరుగుతుందో అదేవిధంగా జరుపుటకు, భద్రాచల దివ్య మూర్తులతో సింగపూర్ వస్తున్నామని అర్చకులు తెలిపారు. శ్రీ సీతారామ కళ్యాణము చూసేందుకు మనమే కాదు సకల లోకాల దేవతలు దివి నుంచి భువికి దిగివచ్చి శ్రీరామచంద్రుని దివ్య దర్శనం మహనీయంగా తిలకించి పులకితులవుతారని తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి అన్నారు. అటువంటి స్వామి స్వయంగా మన సింగపూర్ వచ్చి మనకు కళ్యాణదర్శనం కల్పించడం మన అందరి అదృష్టమని, ఈ సదవకాశాన్ని అందరూ సద్వినియోగించుకోవాలని కోటిరెడ్డి కోరారు. అంగరంగ వైభవంగా సీతారామ కళ్యాణం జరుపుటకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయని కార్యదర్శి సత్య చిర్ల తెలిపారు. ఉదయం పూట కళ్యాణమహోత్సవం, సాయంత్రం రామరక్షాస్తోత్రం, హనుమాన్ చాలీసా పారాయణ, విశేషపూజ ఇతర సాంసృతిక కార్యక్రమాలు జరుగనున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పానకం, వడపప్పు, అన్నదాన వితరణ జరుగనున్నట్లు నిర్వాహకులు అనిల్ పోలిశెట్టి ఒక ప్రకటనలో తెలిపారు. -
అంగరంగ వైభవంగా రామయ్య కల్యాణం
భద్రాచలం : భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. మిథిలా స్టేడియంలోని కల్యాణ మండపంలో అభిజిత్ లగ్నమందు సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు స్వామివారు సీతమ్మ వారి మెడలో మాంగల్యధారణ గావించారు. పురోహితులు పవిత్రమైన అభిజిత్ లగ్నంలో కల్యాణ రాముడి చేత జగన్మాత వైదేహి మెడలో మాంగల్యధారణ చేయించారు. అంతకు ముందు వేద పండితులు మూలమూర్తులకు కల్యాణం అనంతరం మిథిలా మండపానికి ఊరేగింపుగా తీసుకు వచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం కేసీఆర్ దంపతులు ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించారు. సీతారాముల కల్యాణం ఇలలో జరిగే రమణీయ వేడుక. ఊరూరా రాములోరి పెళ్లి జరిగినా భద్రాద్రి కల్యాణోత్సవం కనులారా చూసిన వారిదే వైభోగం. నీలమేఘశ్యాముని నామస్మరణతో భద్రాద్రి పరవశించింది. రామాయణ రసరమ్య సన్నివేశాలతో పులకించిన దివ్యధాత్రి భద్రాచలంలో రామయ్య కల్యాణ ఘట్టాన్ని తిలకించేందుకు దేశం నలుమూలల నుంచి భక్తజనులు తరలి వచ్చారు. దాంతో స్వామివారి కల్యాణాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు వచ్చిన భక్తులతో భద్రాద్రి కిక్కిరిసిపోయింది. సీతారాముల కల్యాణానికి కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. కాగా శనివారం జరిగే శ్రీరాముడి మహాపట్టాభిషేకంలో గవర్నర్ నరసింహన్ దంపతులు పాల్గొంటారు. -
వైభవంగా రాములోరి కల్యాణం
-
వైభవంగా రాములోరి కల్యాణం
భద్రాచలం : భద్రాచలంలో సీతారాముల కల్యాణం శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. మిథిలా స్టేడియంలోని కల్యాణ మండపంలో అభిజిత్ లగ్నమందు సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు స్వామివారు సీతమ్మ వారి మెడలో మాంగల్యధారణ గావించారు. అంతకు ముందు శనివారం మూలమూర్తులకు కల్యాణం అనంతరం మిథిలా మండపానికి వూరేగింపుగా వేంచేస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం కేసీఆర్ దంపతులు ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించారు. సీతారాముల కల్యాణం ఇలలో జరిగే రమణీయ వేడుక. ఊరూరా రాములోరి పెళ్లి జరిగినా భద్రాద్రి కల్యాణోత్సవం కనులారా చూసిన వారిదే వైభోగం. దాంతో స్వామివారి కల్యాణాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు వచ్చిన భక్తులతో భద్రాద్రి కిక్కిరిసిపోయింది. కాగా ఈ నెల 29న శ్రీరాముడి మహాపట్టాభిషేకంలో గవర్నర్ నరసింహన్ పాల్గొననున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి 12.30 గంటల వరకూ జరిగే ఈ వేడుకను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. -
కన్నుల పండువగా సీతారాముల కల్యాణం
రంగారెడ్డి: షాబాద్ మండల కేంద్రంలోని సీతారామచంద్రస్వామి దేవాలయంలో గురువారం దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్ఠాపన, సీతారాముల కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మేళతాళాలు.. మంగళవాయిద్యాలు.. వేదపండితుల మంత్రోశ్చరణల మధ్య మధ్యాహ్నం 12 గంటలకు కల్యాణ ఘట్టాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు కొప్పుల హరీశ్వర్‌రెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ దైవ చింతన అలవర్చుకోవాలని అన్నారు. భగవంతునిపై విశ్వాసం ఉంచి నిత్యం పూజిస్తే తప్పక కరుణిస్తాడన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ వెంకట్‌యాదవ్, ఎంపీటీసీ సభ్యులు సత్యనారాయణ. కుమార్, నాయకులు కూర వెంకటయ్య, రాఘవరెడ్డి, పాపిరెడ్డి, వెంకటేశ్‌గౌడ్, మదన్‌గుప్తా, వేదపండితులు కిష్టయ్యజోషి, శ్రీనుపంతులు తదితరులు పాల్గొన్నారు. (షాబాద్) -
అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం
భద్రాచలం : సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. భద్రాద్రి కళ్యాణ శోభతో కళకళలాడింది. ఆకాశమంత పందిరి ... భూదేవంత పీట ...పచ్చని తోరణాలు స్వాగతం పలుకుతుండగా.. మంగళవాయిద్యాల నడుమ పల్లకిలో శ్రీరామ చంద్రుడ్ని కల్యాణమండపానికి తరలించారు. మండపానికి చేరుకున్న సీతమ్మ తల్లిని దర్శించుకుని భక్తులు పారవశ్యంలో మునిగిపోయారు. విష్ణు స్వరూపుడైన శ్రీరామునికి ..శ్రీమహాలక్ష్మి ప్రతిరూపమైన సీతమ్మనిచ్చి కన్యాదానం నిర్వహించారు. వేద మంత్రాల మధ్య శ్రీరాముడు సీతమ్మకు మంగళ సూత్రధారణ చేశాడు.. రాముని కళ్యాణానికి గవర్నర్ నరసింహన్ ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు.