ముంబై: ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో ముడుపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న శామ్ డిసౌజా మరో కొత్త విషయాన్ని బయటపెట్టారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు నౌకపై దాడి చేసిన తర్వాత ఆర్యన్‌ఖాన్‌ను విడిచిపెట్టడానికి ఆ కేసులో సాక్షి అయిన కిరణ్ గోసావి షారూక్‌ఖాన్ మేనేజర్ పూజ దాడ్లాని దగ్గర నుంచి రూ.50 లక్షలు తీసుకున్నారని ఆరోపించారు. అయితే ఎన్‌సీబీ ఆర్యన్‌ను అరెస్ట్ చేయడంతో తిరిగి ఆ డబ్బులు ఇచ్చేశారని ఈ డీల్‌కి మధ్యవర్తిత్వం వహించినట్టుగా అనుమానాలున్న శామ్‌విల్లి డిసౌజా ఆరోపించారు.
ఆర్యన్‌ను విడిచిపెట్టడానికి ఎన్‌సీబీ అధికారుల తరఫున మధ్యవర్తులు రూ.25 కోట్లు డిమాండ్ చేశారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణల్లో వాస్తవాలను నిగ్గుతేల్చడానికి మహారాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. ఈ విషయాలన్నీ తెలిసిన తనని సిట్ అరెస్ట్ చేస్తుందన్న భయంతో బాంబే హైకోర్టులో శామ్ డిసౌజా ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశాడు. దీన్ని హైకోర్టు తిరస్కరించింది. కిరణ్ గోసవి, ప్రభాకర్ సాయిల్ ఈ కేసులో సాక్షులు కారని, వారే అసలు సిసలైన కుట్రదారులని డిసౌజా ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment