
బనశంకరి(బెంగళూరు): మాదకద్రవ్యాల కేసులో చిత్తూరు జిల్లాకు చెందిన దివంగత పారిశ్రామికవేత్త డీకే ఆదికేశవుల నాయుడు కుమారుడు, పారిశ్రామికవేత్త డీకే శ్రీనివాస్‌నాయుడును ఎన్‌సీబీ అధికారులు మంగళవారం రాత్రి అరెస్ట్ చేశారు.
బుధవారం నగర కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి కస్టడీకి ఆదేశించారు. బెంగళూరు సదాశివనగరలోని ఒక అపార్టుమెంటులో పార్టీ చేసుకుంటుండగా ఎస్‌సీబీ అధికారులు దాడి చేశారు. అక్కడ నిషేధిత మత్తు పదార్థాలు పట్టుబడటంతో శ్రీనివాస్‌నాయుడును అదుపులోకి తీసుకున్నారు.