srinivas naidu
-
వివాహ రిసెప్షన్ వేడుకకు హాజరైన సీఎం జగన్ (ఫొటోలు)
-
నిడదవోలులో వివాహ వేడుకకు హాజరైన సీఎం వైఎస్ జగన్
-
నిడదవోలు: నూతన దంపతులను ఆశీర్వదించిన సీఎం జగన్
నిడదవోలు(తూ.గో. జిల్లా): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు కుమార్తె రిసెప్షన్ వేడుకల్లో పాల్గొన్నారు. దీనిలో భాగంగా బుధవారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పర్యటనకు బయల్దేరివెళ్లిన సీఎం జగన్.. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో తాడేపల్లి నుంచి నిడదవోలుకు బయల్దేరి వెళ్లిన సీఎం జగన్‌కు సుబ్బరాజుపేట హెలిప్యాడ్ వద్ద ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు, జిల్లా కలెక్టర్ మాధవీలత, ఎస్పీ సుదీర్ కుమార్‌లు ఘన స్వాగతం పలికారు. ఉదయం 11 గం.లకు వివాహ రిసెప్షన్ వేదికకు చేరుకున్న సీఎం జగన్.. వధూవరులను ఆశీర్వదించారు. హోం మంత్రి తానేటి వనిత, జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి వేణుగోపాల కృష్ణ, జిల్లా అధ్యక్షుడు జక్కం పూడి రాజా, ఎంపీ మర్గాని భరత్ , పలువురు ప్రజా ప్రతినిధులు వివాహ రిసెప్షన్ వేడుకలో పాల్గొన్నారు. \ -
ఎన్సీబీ అదుపులో డీకే శ్రీనివాస్‌నాయుడు
బనశంకరి(బెంగళూరు): మాదకద్రవ్యాల కేసులో చిత్తూరు జిల్లాకు చెందిన దివంగత పారిశ్రామికవేత్త డీకే ఆదికేశవుల నాయుడు కుమారుడు, పారిశ్రామికవేత్త డీకే శ్రీనివాస్‌నాయుడును ఎన్సీబీ అధికారులు మంగళవారం రాత్రి అరెస్ట్ చేశారు. బుధవారం నగర కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి కస్టడీకి ఆదేశించారు. బెంగళూరు సదాశివనగరలోని ఒక అపార్టుమెంటులో పార్టీ చేసుకుంటుండగా ఎస్సీబీ అధికారులు దాడి చేశారు. అక్కడ నిషేధిత మత్తు పదార్థాలు పట్టుబడటంతో శ్రీనివాస్‌నాయుడును అదుపులోకి తీసుకున్నారు. -
ఆ అక్రమాలు శాంపిల్ మాత్రమే..!
సాక్షి, నిడదవోలు: ఐటీదాడుల్లో వెలుగు చూసిన అక్రమాలు శాంపిల్ మాత్రమేనని..టీడీపీ ముఖ్య నేతలపై కేంద్రం దృష్టి సారిస్తే నమ్మలేని వాస్తవాలు బయటకు వస్తాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జి.శ్రీనివాస్ నాయుడు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భూ దందాలు, కుంభకోణాలను వెలికితీయాలని కేంద్రాన్ని కోరతామని తెలిపారు.(ఐటీపై ఎల్లో డ్యాన్స్) ఐటీ దాడుల్లో వెలుగు చూసిన రెండువేల కోట్ల రూపాయల అక్రమాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయన్నారు. రాజధాని భూముల వ్యవహారంలో కూడా వేల కోట్లు చేతులు మారాయని.. వీటిపై కేంద్రం విచారణ జరిపించాలని కోరారు. చంద్రబాబు ఆస్తులపై విచారణ చేపట్టాలని శ్రీనివాస్ నాయుడు డిమాండ్ చేశారు. ('మౌనంగా ఉంటే నేరాన్ని అంగీకరించినట్లేగా') -
నిడదవోలులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శ్రీనివాస నాయుడు ప్రచారం
-
ముగిసిన శ్రీనివాస్ నాయుడి విచారణ
-
క్లాస్‌మేట్‌ను ప్రేమించి.. పెళ్లికి నిరాకరించాడు
జీడిమెట్ల(హైదరాబాద్): తోటి విద్యార్థినిని ప్రేమించి మోసం చేసిన యువకుడిని జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఎస్సై లింగ్యానాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. చింతల్ మల్లిఖార్జున్‌రెడ్డి నగర్‌కు చెందిన శ్రీనివాస్ నాయుడు ఘట్కేసర్లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంజినీరింగ్ ఫైనలియర్ చదువుతున్నాడు. ఈ క్రమంలో శ్రీనివాస్‌కు క్లాస్మేట్ అమూల్యతో పరిచయం పెరిగింది. అది కాస్తా ప్రేమగా మారింది. అయితే, రెండు నెలల క్రితం అమూల్య పెళ్లి ప్రస్తావన తెచ్చింది. తనకు ఇష్టం లేదంటూ శ్రీనివాస్‌నాయుడు మొహం చాటేశాడు. అమూల్యతో మాట్లాడటం కలవడం మానివేశాడు. దీంతో మనస్తాపానికి గురైన అమూల్య గత నెల 28వ తేదీన చింతల్‌లోని శ్రీనివాస్ నాయుడు ఇంటికి వచ్చి నిద్ర మాత్రలు మింగింది. అపస్మారక స్ధితికి చేరుకున్న అమూల్యను శ్రీనివాస్ కుటుంబ సభ్యులు సురారంలోని మల్లారెడ్డి ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. అమూల్య తండ్రి రాంబాబు ఫిర్యాదు మేరకు పోలీసులు 420, 378, ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు.