సాక్షి, హైదరాబాద్: ఎన్నికల మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకోవాలని, లేనిపక్షంలో తీవ్రమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్లు, ఎస్పీలు/పోలీసు కమిషనర్లకు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్ట మైన హెచ్చరికలు జారీ చేసింది. శాసనసభ ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో ఏమాత్రం నిర్లిప్తత, నిర్లక్ష్యంగా ఉండరాదని, మైండ్‌సెట్ మార్చుకోవా లని తేల్చి చెప్పింది. ఎన్నికల్లో నామమాత్రంగానే డబ్బు, మద్యం జప్తు చేస్తున్నారని, చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని అసహనం వ్యక్తం చేసింది.
డ్రగ్స్ రవాణాకు హైదరాబాద్ ప్రధానమార్గంగా మారిందని, గోవా నుంచి తెలంగాణ మీదుగా మహారాష్ట్ర, గుజరాత్‌కు పెద్దఎత్తున డ్రగ్స్ రవాణా జరుగుతుంటే ఎందుకు పట్టుకోవడం లేద ని పోలీస్‌శాఖను ప్రశ్నించింది. శాసనసభ ఎన్నికల సన్నద్ధతను పరిశీలించడానికి రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్(సీఈసీ) రాజీవ్‌కుమార్ నేతృత్వంలో ఎలక్ష న్ కమిషనర్లు అనూప్‌చంద్ర పాండే, అరుణ్ గోయల్‌తో కూడిన బృందం బుధవారం రెండోరోజు నగరంలోని ఓ హోటల్‌లో రాష్ట్రంలోని 33 జిల్లాల కలె క్టర్లు, ఎస్పీలు/పోలీసు కమిషనర్లతో సమీక్ష నిర్వహించింది.
గుజరాత్, మహారాష్ట్రలో టన్నుల కొద్దీ డ్రగ్స్ పట్టుపడితే, ఇక్కడ మాత్రం 10, 20 గ్రా ము లే పట్టు బడడం పట్ల అనుమానాలు వ్యక్తం చేసింది. మాఫియాతో కుమ్మక్కయ్యారా? అని సూటి గా ఓ ఎస్పీని ప్రశ్నించినట్టు తెలిసింది. ఇక పై ని ఘా ఉంచి జప్తు చేస్తామని ఆ ఎస్పీ వివరణ ఇచ్చు కున్నారు. ఓటర్లకు బంగారం, వెండి, వస్త్రాలు వంటి కానుకలు పంపిణీ చేస్తున్నట్టు ఆరోపణలున్నా, ఎందుకు జప్తు కావడం లేదని ప్రశ్నించింది.
సిద్దిపేటలో నగదు దొరకలేదా ?
గత శాసనసభ సాధారణ ఎన్నికల్లో సిద్దిపేట జిల్లాలో ఎలాంటి నగదు జప్తు చేయకపోవడం పట్ల ఎన్నికల సంఘం తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేసింది. జిల్లాల వారీగా గత ఎన్నికల్లో పట్టుబడిన నగదు, మద్యం, ఇతర కానుకలను పరిశీలించి పెదవి విరిచింది. ఇటీవల జరిగిన కర్ణాటక, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గతంతో పోలి్చతే దాదాపు ఐదారు రేట్లు అధికంగా నగదు జప్తు చేశారని, త్వరలో జరి గే శాసనసభ ఎన్నికల్లో సైతం అలాంటి ఫలితాలు ఆశిస్తున్నామని స్పష్టం చేసింది.
ఐఎంఎఫ్‌ఎల్ లిక్కర్ ఎందుకు పట్టుకోవడం లేదని ఆబ్కారీ, పోలీస్‌శాఖను ప్రశ్నించింది. ఇకపై డబ్బులు, మద్యం, ఇతర కానుకల జప్తుపై ప్రతివారం నివేదిక సమర్పించాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో గతంలో జప్తు చేసిన నగదు, మద్యం చాలా తక్కువగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఓటర్ల జాబితాలో లోపాలుంటే కలెక్టర్లదే బాధ్యత
బుధవారం ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలో లోపాలున్నా, ఓట్లు గల్లంతైనట్టు ఫిర్యాదులొచి్చనా కలెక్టర్లదే బాధ్యత అని, తీవ్రమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని ఎన్నికల సంఘం హెచ్చరించింది. శేరిలింగంపల్లిలో పెద్ద సంఖ్యలో బోగస్ ఓట్లు ఉన్నట్టు వచి్చన ఫిర్యాదుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏం చర్యలు తీసుకున్నారని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను ప్రశ్నించింది.
Comments
Please login to add a commentAdd a comment