
సాక్షి, ముంబై: మాదకద్రవ్యాల కేసులో బాలీవుడ్ సినీ నిర్మాత ఫిరోజ్ నదియడ్‌వాలా భార్య షబానా సయీద్‌ను ఎన్సీబీ అరెస్టుచేసింది. ఆదివారం ఎన్సీపీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖేడే అరెస్టును ధ్రువీకరించారు. ఫిరాజ్ భార్య షబానాను నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డీపీఎస్) చట్టం కింద అరెస్టు చేశామని, తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు. సబర్బన్‌లో జూహూలోని తన నివాసంలో 10 గ్రాముల గంజాయి దొరకడంతో ఎన్సీబీ ఆమెను విచారణకు పిలిచి, అరెస్టు చేసింది. కాగా, ఫిరోజ్‌ను సైతం ఎన్సీపీ విచారణకు పిలవగా ఆయన హాజరుకాలేదు.
Comments
Please login to add a commentAdd a comment