
యశవంతపుర/కర్ణాటక: డ్రగ్స్ కేసుకు సంబంధించి విచారణను ముమ్మరం చేసి గోవిందపుర పోలీసులు సినీ నిర్మాత శంకర్‌గౌడను అరెస్ట్ చేశారు. ఎస్‌ఐ ప్రకాశ్ ఆధ్వర్యంలో సిబ్బంది బుధవారం శంకరగౌడ ఆఫీసు, ఇంటిపై దాడి చేసి సోదాలు చేశారు. ఈ సందర్భంగా డ్రగ్స్, కొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి మరికొందరిని అదుపులోకి తీసుకొని వీకెండ్‌లో నిర్వహించే పార్టీలకు ఎవరెవరు వచ్చారనే వివరాలు రాబట్టినట్లు తెలిసింది.
కాగా కర్ణాటకలో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో విచారణకు రావాలంటూ టాలీవుడ్ హీరో తనీష్‌కు కూడా ఇటీవల బెంగుళూరు పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అతడితో పాటు మరో ఐదుగురికి పోలీసులు అప్పట్లో సమన్లు జారీ చేశారు. వీరిలో ప్రముఖ నిర్మాత శంకర్ గౌడ కూడా ఉన్నాడు. శంకర్ గౌడ ఏర్పాటు చేసిన పార్టీలో పాల్గొన్న పలువురు సెలబట్రీలకు నోటీసులు పంపినట్లు బెంగుళూరు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment