
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, మెదక్: ఉన్నత చదువులు చదవడంతో పాటు ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీహెచ్‌డీ చేసిన చిన్నశంకరంపేట మండలం మడూర్ గ్రామానికి చెందిన గుడికాడి లింగాగౌడ్ డ్రగ్ వ్యాపారం చేస్తూ హైదారాబాద్‌లో పట్టుబడడం చర్చనీయంశంగా మారింది. సోమవారం లింగంగౌడ్‌తో పాటు అతని బంధువైన ఏఆర్ కానిస్టేబుల్ రామకృష్ణాగౌడ్‌ను సైబరాబాద్ డీసీపీ పద్మజారెడ్డి అరెస్టు చేశారు. దీంతో ఒక్కసారిగా చిన్నశంకరంపేట మండలంలో ఈ విషయం చర్చనీయమైంది.
ఉన్నత చదువులతో పాటు గౌరవ ప్రథమైన కుటుంబ నేపథ్యం ఉన్న లింగాగౌడ్ వక్రమార్గం పట్టడం పలువురిని విస్మయానికి గురిచేసింది. హైదరాబాద్‌లోని జీడిమెట్ల ప్రాంతంలో లాబోరేటరీ నడుపుతున్నట్లు స్థానికులకు, పరిచయస్తులకు చెప్పుకునే లింగాగౌడ్ ఒక్కసారిగా 8 కోట్ల విలువ జేసే అల్పోజంతో పట్టుబడడం చర్చనీయాంశంగా మారింది. ఏ నోట విన్న లింగంగౌడ్ ఉదాంతం విని్పంచింది.
Comments
Please login to add a commentAdd a comment