న్యూఢిల్లీ: కోవిడ్ సీరియస్ కేసుల్లో తాము రూపొందించిన ‘అవిప్టడిల్’ అనే ఔషధం అత్యవసర వినియోగం కింద అనుమతి కోసం డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ)కి దరఖాస్తు చేసుకున్నట్లు బయోఫోర్ ఇండియా ఫార్మాస్యూటికల్స్ సంస్థ శుక్రవారం తెలిపింది.
డీజీసీఐ నుంచి అనుమతి లభించిన వెంటనే వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి ప్రారంభిస్తామని పేర్కొంది. తమ ఔషధ వినియోగంతో కోవిడ్ సీరియస్ కేసుల్లో రోగులు వేగంగా కోలుకుంటున్నట్లు రుజువైనట్లు తెలిపింది. కోవిడ్ మొదటి వేవ్ సమయంలో యాంటీ వైరల్ ఔషధం ‘ఫావిఫిరవిర్’ ఉత్పత్తికి అనుమతి పొందిన అతికొద్ది కంపెనీల్లో హైదరాబాద్‌కు చెందిన బయోఫోర్ ఒకటి.
Comments
Please login to add a commentAdd a comment