కోర్బేవ్యాక్స్‌ టీకాకు అత్యవసర అనుమతి | BEs CORBEVAX Gets DCGI Nod for Emergency Use in 5 to 12 Years | Sakshi
Sakshi News home page

కోర్బేవ్యాక్స్‌ టీకాకు అత్యవసర అనుమతి

Published Tue, Apr 26 2022 7:22 PM | Last Updated on Tue, Apr 26 2022 7:35 PM

BEs CORBEVAX Gets DCGI Nod for Emergency Use in 5 to 12 Years - Sakshi

హైదరాబాద్‌కి చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ బయోలాజికల్‌ -ఇ  కంపెనీ రూపొందించిన కోర్బేవ్యాక్స్‌ టీకా ఉపయోగానికి అత్యవసర అనుమతులను డ్రగ్స్‌ కం‍ట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) మంజూరు చేసింది.  కోవిడ్‌ రాకుండా అడ్డుకునేందుకు ఈ వ్యాక్సిన్‌ను 5 నుంచి 12 ఏళ్లలోపు పిల్లలకు ఉపయోగించవచ్చు.

కోర్బేవ్యాక్స్‌కి సంబంధించి ఫేజ్‌ 2, 3 ట్రయల్స్‌లో 312 మంది పిల్లలకు 0.5 ఎంఎల్‌ వ్యాక్సిన్‌ అందించి పరిశీలించగా సానుకూల ఫలితాలు వచ్చాయి. దీంతో వీటిని పరిశీలించిన డీసీజీఐ కోర్బేవ్యాక్స్‌ వినియోగానికి అత్యవసర అనుమతులు జారీ చేసింది. ఐదేళ్ల వయసు పైబడిన పిల్లలకు దేశీయంగా తొలి వ్యాక్సిన్‌ను బయోలాజికల్‌ - ఇ సంస్థ తయారు చేసింది. పిల్లలకు సైతం వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడం వల్ల కోవిడ్‌ పూర్వ స్థితికి పరిస్థితులు వస్తున్నట్టే అంటూ ఆ కంపెనీ ఎండీ మహిమ దాట్ల తెలిపారు. 

చదవండి: మనదేశంలో రుణం..'కొందరికే' పరిమితం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement