న్యూఢిల్లీ: వ్యాక్సినేషన్ సెంటర్ల సమాచారం ఇకపై గూగుల్‌లో కూడా లభ్యం కానుంది. ఈ మేరకు గూగుల్ సంస్థ శుక్రవారం ఓ ప్రకటన చేసింది. గూగుల్ సెర్చ్, మ్యాప్స్, గూగుల్ అసిస్టెంట్ వంటి టెక్నాలజీ యాప్స్ ద్వారా వ్యాక్సినేషన్ సెంటర్ల సమాచారాన్ని యూజర్లకు అందించనున్నారు. దీనికోసం కేంద్ర ఆరోగ్యశాఖ, బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్‌లతో కలసి పనిచేసినట్లు గూగుల్ చెప్పింది. అంతేగాక వ్యాక్సిన్‌పై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు, ఫేక్ న్యూస్‌ను అడ్డుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఈ బృందాల ద్వారా ప్రజలు ప్రభుత్వం అందించిన అధికారపూర్వకమైన సమాచారాన్ని పొందుతున్నట్లు తెలిపింది. ఇంగ్లిష్‌తో పాటు తెలుగు, తమిళం, హిందీ వంటి స్థానిక భాషల్లో కూడా సమాచారాన్ని అందుబాటులో తీసుకువచ్చినట్లు చెప్పింది. గూగుల్ ట్రెండ్స్‌లో సైతం వ్యాక్సినేషన్ సమాచారాన్ని అప్‌డేట్ చేస్తున్నట్లు వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment