Google to Stop Salaries & Eventually Fire Unvaccinated Employees Says Report - Sakshi
Sakshi News home page

గూగుల్‌ షాకింగ్‌ నిర్ణయం.. ఆ ఉద్యోగుల తొలగింపు!

Published Wed, Dec 15 2021 11:15 AM | Last Updated on Wed, Dec 15 2021 11:49 AM

Google Will Fire Staff Who Refuse To Take Vaccines - Sakshi

కరోనా టైంలో వర్క్‌ఫ్రమ్‌ హోం ద్వారా ఉద్యోగులకు ఊరట ఇస్తూ వస్తున్న టెక్‌ దిగ్గజ కంపెనీలు.. ఒమిక్రాన్‌ వేరియెంట్‌ వ్యాప్తి నేపథ్యంలో ‘ఆఫీస్‌ రిటర్న్‌’ను కొంత కాలం వాయిదా వేసే ఆలోచనలో ఉన్నాయి.  ఈ క్రమంలో ఆల్ఫాబెట్‌ కంపెనీ ‘గూగుల్‌’ అయితే ఏకంగా నిరవధిక వాయిదాను ప్రకటించింది కూడా. అయితే వ్యాక్సిన్‌ వేయించుకోని ఉద్యోగులను తొలగించాలన్న గూగుల్‌ ఉత్తర్వులపై ఇప్పుడు విమర్శలు మొదలయ్యాయి. 


తాజాగా గూగుల్‌ లీడర్‌షిప్‌ పేరిట ఒక మెమో ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది. డిసెంబర్‌ 3లోపు వ్యాక్సినేషన్‌ స్టేటస్‌ను సమర్పించని ఉద్యోగులపై చర్యలు తప్పవని అందులో ఉంది. ఈ మేరకు సీఎన్‌బీసీ, రాయిటర్స్‌లు ఆ మెమోకు సంబంధించిన కాపీలను ప్రచురించాయి. వ్యాక్సిన్‌ స్టేటస్‌ను సమర్పించని ఉద్యోగులకు జీతాల్లో కోతలు విధించమో లేదంటే శాశ్వతంగా విధుల నుంచి(అసలు వ్యాక్సిన్‌ వేయించుకోనివాళ్లను) తొలగించడమో  చేయాలని భావిస్తోంది. 

ఈ అఫీషియల్‌ మెమో ప్రకారం.. డిసెంబర్‌ 3లోపు వ్యాక్సినేషన్‌ స్టేటస్‌ను అప్‌లోడ్‌ చేయని గూగుల్‌ ఉద్యోగులపై చర్యలు తప్పవు. అలాగే వ్యాక్సినేషన్‌కు దూరంగా ఉన్న ఉద్యోగులు.. ఎన్ని విజ్ఞప్తులు చేసినా గూగుల్‌ ఇక పట్టించుకోదు. వ్యాక్సినేషన్‌ రూల్స్‌ ఉల్లంఘించిన వాళ్లపై జనవరి 18, 2022 లోపు చర్యలు ఉంటాయి. వాళ్లను ముందుగా 30 పెయిడ్‌ లీవ్‌ మీద పక్కనపెడతారు. లేదంటే అన్‌పెయిడ్‌ పర్సనల్‌ లీవ్‌ మీద ఆరు నెలలు పక్కనపెడతారు. ఆపై ఏకంగా విధుల నుంచి తొలగిస్తారు.

అయితే ఈ మెమోపై స్పందించేందుకు గూగుల్‌ ప్రతినిధులు నిరాకరించారు. ఇక యూఎస్‌ కంపెనీలకు బైడెన్‌ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల అనుసారం.. వ్యాక్సినేషన్‌ తప్పనిసరి చేసింది గూగుల్‌. దీనిపై ఆన్‌లైన్‌ సైన్‌ పిటిషన్‌ ద్వారా ఉద్యోగులు నిరసన వ్యక్తం చేయడంతో.. అఘమేఘాల మీద ఆ ఉత్తర్వుల్ని సైతం నిలుపుదల చేసినట్లు ప్రకటించుకున్న గూగుల్‌. ఈ క్రమంలో ఇలా ఉన్నపళంగా ఉద్యోగులను తొలగిస్తామన్న ప్రకటన తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.

చదవండి: గూగుల్‌ ఇయర్‌ ఇన్‌ సెర్చ్‌ 2021.. మనోడు కాకున్నా తెగ వెతికారు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement