పొగరాయుళ్ల కోసం కేంద్రం వినూత్న ప్రయోగం | TOBACCO Govt to launch 'M Cessation' to help kick tobacco habbiti | Sakshi
Sakshi News home page

పొగరాయుళ్ల కోసం కేంద్రం వినూత్న ప్రయోగం

Published Sun, Oct 11 2015 1:54 PM | Last Updated on Mon, Oct 22 2018 2:17 PM

పొగరాయుళ్ల కోసం కేంద్రం వినూత్న ప్రయోగం - Sakshi

పొగరాయుళ్ల కోసం కేంద్రం వినూత్న ప్రయోగం

న్యూఢిల్లీ:  పొగత్రాగడం మానేయాలనికునే వారికి గుడ్ న్యూస్. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వారి కోసం ప్రత్యేకంగా ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. మొబైల్ కౌన్సిలింగ్ ఇచ్చి స్మోకింగ్ మానేయడానికి సహకారం అందించడానికి ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ఓ మొబైల్ నెంబర్కు మిస్డ్ కాల్ ఇస్తే వారి డేటాను రిజిస్టర్ చేసుకుంటారు.ఆ తర్వాత ఎసెమ్మెస్ రూపంలో మూడు నుంచి నాలుగు ప్రశ్నాలకు సమాధానం పంపించాల్సి ఉంటుంది. వాటిలో వయస్సు, విద్యార్హతలు, ఉద్యోగ వివరాలు, ఎన్నేళ్ల నుంచి ధూమపానం అలవాటుంది లాంటి వివరాలు పంపించాలి. స్మోకింగ్ మానడానికి సూచనలిస్తూ ప్రతిరోజు 4 మెసేజ్లు వస్తాయి.

ఉదాహరణకు దేవుని పట్ల నమ్మకం ఉన్న వారికి దేవి నవరాత్రుల నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని సూచిస్తారు. దీంతో వారిలో మార్పు రావడానికి అవకాశముంటుందని భావిస్తున్నారు. ఇలాంటి ప్రయోగాలు చేయడం వల్ల కొంత వరుకైనా మార్పు చేయవచ్చునని కేంద్ర ఆరోగ్యాధికారి అరోరా తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రజల్లో చైతన్యపరచడానికి టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులోనికి తేనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ధూమపానం చేసేవారిలో భారత్ రెండో స్థానంలో ఉంది. ఏటా 10 లక్షల మంది వరకు స్మోకింగ్ చేయడం వల్ల క్యాన్సర్, టీబీ వ్యాధులతో మరణిస్తున్నారని లెక్కలు చెబుతున్నాయి. ప్రతి ఏటా దశల వారిగా స్మోకింగ్ను నియంత్రించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement