న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 20 లక్షలు దాటింది. మరోవైపు బుధవారం 64,531 కొత్త కేసులు వెలుగు చూడటంతో మొత్తం కేసుల సంఖ్య 27,67,273కు చేరుకుంది. గత 24 గంటల్లో 60,091 మంది కోలుకోగా, 1,092 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 52,889 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 20,37,870కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 6,76,514 గా ఉంది. మొత్తం కేసుల్లో యా క్టివ్ కేసుల సంఖ్య 24.45 శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య నాలుగింట ఒక వంతుగా ఉంది. దేశంలో రికవరీ రేటు 73.64 శాతానికి పెరిగినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు 1.91 శాతానికి పడిపోయిందని తెలి పింది. ఆగస్టు 18 వరకు 3,17,42,782 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.
తేమతో కరోనా మరింత ప్రమాదకరం
వాషింగ్టన్: గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంటే కరోనా వైరస్ మనిషికి వెలుపల జీవించే సమయం 23 రెట్లు ఎక్కువగా ఉంటుంద నిఓ పరిశోధనలో తేలింది. ఈ వివరాలు ఫిజిక్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. గాలి వదిలే సమయంలో, దగ్గినా, తుమ్మినా వైరస్ తుంపరల ద్వారా బయటకు వస్తుంది. ‘మనిషి నుంచి వచ్చే తుంపర్ల ద్వారా వైరస్ సులువుగా వ్యాప్తి చెందుతుంది. వైరస్‌కు గాలిలో తేమ తోడైతే చాలా ప్రమాదరకరం. ఎక్కువ పరిమాణం ఉన్న మైక్రాన్లు ఎక్కువ వైరస్‌ను కలిగి ఉంటాయి. 50 మైక్రాన్లు ఉన్న తుంపరలు 16 అడుగుల దూరం వ్యాపించగలవు. 100 మైక్రాన్లు ఉన్న తుంపరలు ఆరడుగుల దూరం ప్రయాణించగలవు. అయితే 3.5 మీటర్లను దాటి ఏ తుంపరలు ప్రయాణించలేవు. భౌతిక దూరం పాటించడం ఒక్కటే తప్పించుకునే మార్గం’ అని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment