న్యూఢిల్లీ: భారత్‌లో బుధవారం కొత్తగా 60,963 కేసులు బయట పడటంతో మొత్తం కేసుల సంఖ్య 23,29,638కు చేరుకుంది. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 56,110 కోలుకోగా, 834మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 46,091 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 16,39,599కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 6,43,948గా ఉంది.
మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 27.64గా ఉంది. దేశంలో కరోనా రికవరీ రేటు 70.38 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు 1.98 శాతానికి పడిపోయిందని తెలిపింది. గత 12 రోజులుగా ప్రతి రోజూ 50 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ నెల11 వరకు 2,60,15,297 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. దేశంలో ప్రతి 10 లక్షల జనాభాకు చేస్తున్న పరీక్షల సంఖ్య 18,852కు చేరిందని, ప్రస్తుతం 1,421 ల్యాబ్‌ల్లో పరీక్షలు జరుపుతున్నట్లు వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment